అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ సచివాలయం, హెచ్ ఓడీ ఉద్యోగులకు గృహ వసతి సదుపాయాన్ని ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఆగస్టు నెలాఖరు వరకు ఉద్యోగులకు వసతి సౌకర్యం లభించనుంది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం ఉచిత వసతి సదుపాయాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు వివిధ ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది. గురువారం లోగా భవనాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భవనాలను ఎలాంటి రిపేర్లు లేకుండా తిరిగి అప్పగించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వ ఆదేశాలతో ఏం చేయాలో అర్థంకాక సచివాలయ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. అయితే సాయంత్రానికిఉద్యోగులకు ఇస్తున్న ఉచిత గృహ వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలపాటు పొడిగించిందనే వార్తలతో ఉద్యోగులు కొంత పూరట చెందారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి జగన్ వసతి సౌకర్యాన్ని మరో రెండు నెలలు పొడిగించారని అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.