కొండపి, మార్చి 2( ప్రభ న్యూస్) : స్థానిక మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో అనుమోలు వెంకటేశ్వర్లు, అనుమోలు ఆదిలక్ష్మి అను రైతులకి చెందిన పొగాకు బ్యర్ని దగ్గర పచ్చాకు కూలీలు ఏర్పాటు చేసుకున్న గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీనికి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణం అంటున్నారు గ్రామస్థులు. ఆ ప్రక్కనే ఉన్న గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలడంతో చుట్టుపక్కల జనం ఏమి జరుగుతుందో అని భయంతో పరుగులు తీశారు.
ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కట్టుబడిపాలెం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు పొగాకు బ్యార్నిలకు సంబంధించి అయిదు లక్షల రూపాయల విలువ చేసే పొగాకు అగ్నికి ఆహుతైందని బ్యార్ని యజమానులు వివరాలు అందించారు. కొండపి పైర్ సిబ్బందికి సమాచారం ఇస్తే అది తమ పరిధి కాదు అనడంతో దిక్కుతోచని స్థితిలో 100 కాల్ చేయడంతో టంగుటూరు నుండి ఫైర్ సిబ్బంది, ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్థులు వాపోయారు.