కృష్ణా, ప్రభన్యూస్ : వైకాపాను సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. ఉగాది నుంచి శాసనసభ్యులు ప్రజల్లో ఉండేలా దిశానిర్ధేశం చేశారు. రానున్న రెండేళ్లు శానససభ్యులు ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రతి ఇంటికి మూడు సార్లు శాసనసభ్యులు వెళ్లి, ప్రభుత్వ పరంగా వారు పొందుతున్న ప్రయోజనాలను గుర్తు చేస్తూ వైకాపాకు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకతను వివరించాల్సి ఉంది. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుని వారితో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఉగాది నుంచి నెలరోజు పాటు ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సన్మానించనున్నారు. బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటుతో పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సర్వసన్నదం చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..