ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. భారత్ నెట్ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ-ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీపై రూ.650 కోట్లు ఏపీకి తిరిగి ఇవ్వాలని కోరారు.
ఏపీలో మొత్తం 6200 పాఠశాలలు, 1978 ఆరోగ్య కేంద్రాలు, 11254 గ్రామ పంచాయతీలు, 5800 రైతు కేంద్రాలు, 9104 ప్రభుత్వ కేంద్రాలకు ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నట్లు కేంద్రానికి వివరించింది. అవసరమైన 35లక్షల సీపీఈ బాక్సులను వెంటనే అందజేస్తే భారత్ నెట్ సేవలను విస్తరింపజేస్తామని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అలాగే భారత్ నెట్ ఫేజ్-3 ప్రతిపాదనలను కూడా కేంద్రానికి సమర్పించనున్నట్లు అధికారులు కేంద్రానికి తెలియజేశారు.