Friday, November 22, 2024

Exclusive – మడతపెట్టేశారు! ఏపీలో డైలాగ్​ వార్​

లీడర్లలో కుర్చీ కష్టాలు
అందరూ మడత వార్నింగ్
పాలిటిక్స్​లో గుంటూరు కారం సెగ
చొక్కాతో వైఎస్సార్​ కాంగ్రెస్​ బోణీ
కుర్చీతో రీ సౌడ్​ ఇచ్చిన తెలుగుదేశం
ఏపీ పొలిటికల్ సీన్లో మాస్​ డైలాగ్ జోష్
కుర్రాళ్లలో హీట్​ పెంచుతున్న పాలిటిక్స్​​

గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతెట్టి అనే పక్కా మాస్ డైలాగ్ ఇప్పుడు ఏపీ లీడర్ల నోటిలో తెగ నానుతోంది. ఆ డైలాగ్​తో సినిమా రేంజ్​ పెరిగి యూత్​ని ఉర్రూతలూగిస్తుంటే.. ఈ డైలాగ్ ఏపీ పాలిటిక్స్​లో వైరల్ అవటమే కాదు.. అందరికీ తెగ కనెక్ట్ అవుతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన వలంటీర్లకు వందనం సభలో సీఎం జగన్ ఈ మాస్ డైలాగ్ వాడారు. చొక్కా చేతులు మడత బెట్టి రంగంలోకి దిగాలని పార్టీ కేడర్​ని చైతన్య పరిచారు. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రీ సౌండ్​ ఇచ్చేలా కుర్చీలు మడతపెడతామని రిటార్ట్​ ఇచ్చారు.

చంద్రన్న కౌంటర్..

ఈ ఎన్నికల యుద్ధంలో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కార్యకర్తలను కోరుతూ సీఎం జగన్ నోట ఈ మాస్ డైలాగ్ యూత్​ని కుదిపేసింది. కేరింతలు ఈలలు మార్మోగిపోయాయి. ఇది సరే.. విజయవాడలో జరిగిన విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నవ యవ్వనుడిలా రెచ్చిపోయారు. జగన్ మాస్ డైలాగ్​కి అదే రేంజ్​లో కౌంటర్ ఇచ్చారు. ‘‘మీరు చొక్కా చేతులు మడత బెట్టి వస్తే మేము ఊరుకుంటామా.. టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీలు మడత పెట్టి వస్తారు. అపుడు జగన్ కూర్చున్న సీఎం కుర్చీయే గల్లంతు అవుతుంది” అని పక్కా మాస్ టోన్​తో చెలరేగిపోయారు. బాబు ఈ డైలాగ్ చెబుతూంటే సభలో పాల్గొన్న పసుపుసేన కేడర్ ఫుల్ జోష్​తో గంతులేశారు.

కేడర్​లో మరింత ఉత్సాహం..

ఈ ఏజ్​లో బాబు కూడా మమమ్మాస్ అంటూ తనలోని న్యూ షేడ్​ని పరిచయం చేయడంతో ఈసారి పొలిటికల్ వార్ కొత్త స్టైల్​లో జరగబోతోందని చాలామంది చెప్పుకుంటున్నారు. ఎర్లీ సెవెంటీస్ (1970) నుంచి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చంద్రబాబు 2024కి అప్డేట్ అయినట్లుగా ఆయన తాజా మాటల తూటాలతో అర్థమవుతోందని కేడర్ మురిసిపోతోంది. యూత్ కి కనెక్ట్ కావడంతో పాటు మాస్ కి దగ్గర అయ్యేందుకు బాబు ఈ స్టైల్ ని ఎంచుకున్నారని కుర్రోళ్లు సంబురపడుతున్నారు. “ఎన్నికలు అంటే యుద్ధం కాదు.. జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో. మీరు సీఎం సీటులో ఉన్నారు. హుందాగా మీరు ఉంటే మేమూ ఉంటాం” అని ఒక మాస్ వార్నింగ్​ ఈ సందర్భంగా బాబు ఇచ్చేసారు.

- Advertisement -

సీనియర్ల సీటీజన్లలోనూ జోష్

ఒకవైపు రాజకీయాల్లో సినీ ఫేమ్ డైలాగ్స్ సందడి చేస్తుంటే.. సీనియర్ సిటీజన్లూ సీటీలు మోగిస్తున్నారు. కానీ, పైకి ఇదేం భాష అంటూ గొణుగుడు స్టార్ట్ చేశారు. ఎందుకంటే.. ‘‘జగన్ ఒకటి అంటే మేము నాలుగు అప్ప చెబుతాం” అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. మరో వైపు టీడీపీ జనసేన పొత్తుతో మాస్ కేడర్​కి రీచ్ అయ్యేందుకు బాబు కొత్త అవతార్​లోకి మారినట్టు తెలుస్తోంది. జగన్ సైతం చొక్కాలు మడతపెట్టి అని మాస్​గా స్టార్ట్ చేస్తే కుర్చీలు మడతెడదామని బాబు దాన్ని వేరే సౌండ్​తో ముగించారు. మొత్తానికి ఎన్నికలు మేఘాలు కమ్ముతున్న వేళ ప్రధాన రాజకీయ పక్షాలు వైసీపీ, టీడీపీ అధినేతలే కాదు… పార్టీ కేడర్ మధ్య కూడా నయా డైలాగ్ వార్ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement