Sunday, November 17, 2024

Exclusive – ప్రతీకార రాజకీయం బూమరాంగే

పసునూరి భాస్కర్– ఎగిక్యూటివ్ ఎడిటర్

రేవంత్‌, కాంగ్రెస్‌ మంత్రులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.విమర్శల పేరుతో అభ్యంతరకర భాష ప్రయోగిస్తున్నారు. కేసుల ఊసెత్తుతున్నారు. ఇలాంటివి వికటిస్తాయే తప్ప రేవంత్‌ టీమ్‌కు వ్యక్తిగతంగాకానీ, పార్టీ పరంగాగానీ ఉపయోగపడవు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యూహం మార్చాలి.

హుందా రాజకీయ పంథాను ఎంచుకోవాలి. ప్రజలు ఇష్టపడే ధోరణిని ప్రదర్శించాలి.చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్‌ సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే జాగ్రత్తగా అడుగులు వేయాలి.

ఇంచుమించు తన వయసువారైన కేటీఆర్‌, హరీష్‌లను టార్గెట్‌గా చేసుకోవడం తప్పుకాదు. రాజకీయాల్లో ప్రత్యర్థులతో కొట్లాడటం తప్పుకాదు. కానీ అది ఏ తరహాలో ఉండాలన్నది ముఖ్యం. అవినీతి, అక్రమాలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రిగా రేవంత్‌ బాధ్యత. అది తప్పు కాదు. కానీ కక్ష సాధింపులో భాగంగానే ఆ చర్యలు తీసుకు న్నారన్న భావన ప్రజల్లో కలగకూడదు.రాజకీయాల్లో ప్రతీకార ధోరణులు, కక్షసాధింపు వ్యూహాలు చాలాసార్లు బూమరాంగ్‌ అయ్యాయి.

- Advertisement -

తెలుగునేలపై చాలాసార్లు అది రుజువైంది కూడా. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలు, కేటీఆర్‌పై చేస్తున్న ఆరోపణలు, వాడ్నుతున్న భాష, పదప్రయోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సగటు పౌరుడు ఇలాంటి రాజకీయాలను, భాషను ఇష్టపడడు. ప్రతీకార రాజకీయాలను వారు ప్రోత్సహించారు..

సభల్లో దూకుడుగా మాట్లాడినప్పుడు చప్పట్లు మోగొచ్చు.. వివాదాస్పద వ్యాఖ్యలతో పత్రి కల్లో పతాకశీర్షికలు రావొచ్చు. కానీ అంతిమంగా ఎన్నికల్లో అలాంటి రాజకీయాలు ప్రతికూలంగానే పనిచేస్తాయి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధి కారంలో ఉండగా రేవంత్‌ను కేసుల్లో ఇరికించి, వేధించారన్న సానుభూతి.. ఆ పార్టీ ఓటమికి, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి పరోక్షంగా కారణమైంది.

ఏపీలో జగన్‌ను కేసుల్లో ఇరికించారన్న భావనతో ఏర్పడిన సానుభూతి, అతడు అధికారంలోకి రావడానికి ఒక కారణమైంది. జగన్‌ అధికారంలోకి వచ్చాక చంద్రబాబును అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో వేధించారన్న భావన ప్రజల్లో నెలకొన డంతో ఆయనకు అండగా నిలిచారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ ఆరోపణలు, విమర్శల్లో, చర్యల్లో వాస్తవాలు, నిజాలు ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజల్లో ప్రతీకార చర్యగా ముద్రప డకూడదు. చిన్నవయసులోనే ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్‌ వ్యూహం మార్చాలి.

హుందాగా వ్యవహరించాలి.

దూకుడు తగ్గి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలి. అప్పుడు సుదీర్ఘకాలంపాటు ప్రజల అండదండలుంటాయి.తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం చాలా వేడె క్కాయి. హైడ్రా ఏర్పాటు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలు నేపథ్యంలో మొదలైన వేడి తారాస్థాయికి చేరింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ ఆర్‌ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర పదజాలంతో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.

కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్లు, ఫార్ములా వన్‌ ఈ రేస్‌ వంటి వ్యవహార్లో దర్యా ప్తులు ఊపందుకున్నాయి. తెరవెనుక ఏదో జరుగుతోందన్న ఉత్కంఠ కలిగిస్తున్నారు. బాంబులు పడతాయంటూ కొం దరు మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. పరోక్షంగా బీఆర్‌ ఎస్‌ అగ్రనేతల అరెస్టులుంటాయన్న సంకేతాలు ఇస్తు న్నారు. ప్రస్తుతానికి కేసీఆర్‌ మౌనంగానే ఉంటున్నప్పటికీ.. కేటీఆర్‌ మాత్రం తీవ్రస్థాయిలోనే ప్రతిస్పందిస్తున్నారు.

హైదరాబాద్‌లోనే ఉన్నా… అరెస్టు చేసుకోమంటూ సవాల్‌ విసురుతున్నారు. ఇంచుమించు కాంగ్రెస్‌ మాదిరిగానే అదే స్థాయిలో పదప్రయోగం చేస్తున్నారు. ఢీ అంటే ఢీ అంటు న్నారు. రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాల్లో ప్రభుత్వ విఫలమైందంటూ దుయ్యబడుతున్నారు. కేసులకు, అరెస్టు లకు భయపడబోమంటున్నారు. నిజానికి అరెస్టులు జరుగు తాయా? ఎవరిని అరెస్టు చేస్తారు? అనేవి ఊహాజనితమే.

ఇక్కడ అధికారపక్షం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రతీకార రాజకీయాలను ప్రజలు గతంలో ఎప్పుడూ ఆద రించలేదు. కక్షసాధింపునకు పాల్పడుతున్నారన్న భావన ప్రజల్లో కలిగితే అధికార పక్షానికి నష్టమే జరుగుతుంది. వా స్తవాలు ఏమైనా, చర్యలు సమంజసమే, చట్టబద్ధమే అయి నా.. ప్రతీకార చర్యలుగా భావించేలా ప్రభుత్వాధి నేతలు ప్రవర్తిస్తే వికటిస్తుంది. గతానుభవాలు అదే చెబుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. 2004-2009 మధ్య వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేసింది. తెలుగుదేశం పార్టీ విపక్షపాత్రకు పరిమితమైంది. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వైఎస్‌ఆర్‌, రోశయ్య వంటివారు చెడు గుడు ఆడుకున్నారు. అదే స్థాయిలో చంద్రబాబు ఎదురు దాడికి దిగేవారు. అసెంబ్లిలో వారి మధ్య జరిగే చర్చ హాట్‌ హాట్‌గా ఉండేది. అసెంబ్లి సమావేశాల ప్రత్యక్ష ప్రసారంలో చర్చలను చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కుపోయే వారు. చర్చ ఎంత తీవ్రంగా జరిగినా.. ఆరోపణలు ఏ స్థాయిలో ఉన్నా అవి అసెంబ్లికే పరిమితమయ్యేవి. విడిగా కక్షసాధింపులకు వైఎస్‌ఆర్‌ ఇష్డపడేవారు కాదు.

చంద్రబాబు దగ్గరి బంధువు, విపక్షానికి చెందిన బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటనను వైఎస్‌ఆర్‌ రాజకీయాలకు వాడుకో లేదు. కేసుల పేరుతో వారిని వేధించలేదు. ఆ వ్యవహారాన్ని పోలీసులకే వదిలేశారు. ఆ ఉదంతంపై బయట విమర్శలు కూడా చేయలేదు. కానీ విపక్షాలను ఎక్కడ ఎండగట్టాలో అక్కడ దుమ్ముదులిపేవారు. వైఎస్‌ఆర్‌ దార్శనికత అది. పరిపాలన దగ్గర మాత్రం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకు న్నారు.

జనక్షేత్రంలోకి వెళ్లి రెండోదఫా (2009) మళ్లి గెలి చారు. దురదృష్టవశాత్తూ ప్రమాదంలో కన్నుమూ శారు. ఆ తరువాతి పరిణామాల్లో జగన్‌పై అక్రమాస్తుల కేసు కార ణంగా 15 నెలలపాటు జైలులో ఉన్నారు. ఇది టీడీపీ, కాంగ్రెస్‌ కక్షపూరితంగా చేశాయన్న భావన ప్రజల్లో నెల కొంది. ఆయనపై సానుభూతికి కారణమైంది. రాష్ట్ర విభజన దరిమిలా 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్ప టికీ, 2019లో జగన్‌ అధికారంలోకి రావడానికి పరోక్షంగా ఈ సానుభూతి పనిచేసింది.

ఇక తెలంగాణ విషయానికి వద్దాం. ప్రత్యేక తెలంగాణ సాధనతో కేసీఆర్‌ ప్రజల దృష్టిలో హీరోగా నిలిచారు. అద్భుతమైన పథకాలు అమలు చేశారు. కాళేశ్వరంవంటి సూపర్‌ ప్రాజెక్టులతో దేశమంతా ఇటువైపు చూసేలా చేశారు. జనం వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నారన్న నెపంతో రేవంత్‌ రెడ్డిపై ఓటుకు నోటు కేసు పెట్టడం, ఆయన కుమార్తె వివాహం వేళ అరెస్టు చేయడం వంటి చర్యలు కక్షసాధింపు చర్యలుగానే ప్రజలు భావిం చారు.

రేవంత్‌ అప్పట్లో టీడీపీలో ఉన్నప్పటికీ ప్రజల్లో సానుభూతి వచ్చింది. ఆ తరువాతి పరిణామాల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరి శాసనసభ ఎన్నికలకు (2023) వెళ్లారు. రేవంత్‌పై కేసీఆర్‌ తీవ్రపదజాలంతో విమర్శలు గుప్పించడం వంటి పరిణామాలు వికటిం చాయి. ప్రజలు రేవంత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ను ఆదరించారు.

ఇవన్నీ తెలుగునాట జరిగిన పరిణామాలు.ప్రభుత్వంపై విపక్ష నేతలుగా కేటీఆర్‌, హరీష్‌, బీజేపీకి చెందిన బండి సంజయ్‌ వంటివారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో అది సహజం. సోషల్‌ మీడియా కాస్త అతిగా స్పందిస్తోంది.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నేపథ్యంలో అగ్రనేత రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని రేవం త్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. సహజంగా ముఖ్య మంత్రి రేవంత్‌ సహా కాంగ్రెస్‌ నేతలకు ఇది గిట్టదు. ఈ నేప థ్యంలో రేవంత్‌, కాంగ్రెస్‌ మంత్రులు దూకుడుగా వ్యవహ రిస్తున్నారు. విమర్శల పేరుతో అభ్యంతరకర భాష ప్రయోగి స్తున్నారు. కేసుల ఊసెత్తుతున్నారు. ఇలాంటివి వికటిస్తాయే తప్ప రేవంత్‌ టీమ్‌కు వ్యక్తిగతంగాకానీ, పార్టీ పరంగాగానీ ఉపయోగపడవు.

ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యూహం మార్చాలి. హుందా రాజకీయ పంథాను ఎంచుకో వాలి. ప్రజలు ఇష్టపడే ధోరణిని ప్రదర్శించాలి.కాళేశ్వరం సహా అనేక వ్యవహారాల్లో కుంభకోణాలు, అవినీతి జరిగిందని భావిస్తున్నప్పుడు, ఆధారాలున్నప్పుడు ఆ కేసుల సంగతి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించడం ఓ పరిష్కారం. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. కేసుల్లో నిజానిజాలను కేంద్రం నిగ్గు తేల్చాలి. వాస్తవాలు రూఢీ అయితే చర్యలు తప్పవు.

అది కేంద్రం ఖాతాలోకి వెడు తుంది. కక్షసాధింపునకు పాల్పడ్డారన్న అపఖ్యాతి రేవంత్‌కు తప్పతుంది. చర్యలు తీసుకోకపోతే… బీఆర్‌ఎస్‌తో కేంద్రం లోని బీజేపీ మిలాఖత్‌ అయ్యారంటూ విమర్శించే అవకాశం దక్కుతుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన ఉందని ఎప్పటినుంచో కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణకు దీనితో బలం చేకూరుతుంది.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక వాస్తవాన్ని గుర్తించాలి. కేసీఆర్‌పై ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ, సానుభూతి ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువేమీ కాదు. స్థానిక కారణాలవల్ల ఆ పార్టీ ఓటమి పాలైంది. తెలం గాణ తెచ్చుడులో కేసీఆర్‌ పాత్రను మరవలేం. పైగా వయసు మీరింది. మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనపై దూకుడుగా వ్యవహరిస్తే కక్షసాధింపుగానే ప్రజలు భావించే అవకాశం ఉంది.

చిన్న వయసులో ముఖ్యమం త్రిగా ఎదిగిన రేవంత్‌ సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇంచు మించు తన వయసువారైన కేటీఆర్‌, హరీష్‌లను టార్గెట్‌గా చేసుకోవడం తప్పుకాదు. రాజకీయాల్లో ప్రత్యర్థులతో కొట్లా డటం తప్పుకాదు. కానీ అది ఏ తరహాలో ఉండాలన్నది ముఖ్యం.

అవినీతి, అక్రమాలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రిగా రేవంత్‌ బాధ్యత. అది తప్పు కాదు. కానీ కక్షసాధింపులో భాగంగానే ఆ చర్యలు తీసుకు న్నారన్న భావన ప్రజల్లో కలగకూడదు. అసెంబ్లి వేదికగా సాధికార చర్చకు ఆస్కారం ఇవ్వాలి. అక్కడే విమర్శలు గుప్పించాలి. తప్పు లను నిరూపించాలి. సంక్షేమాభి వృద్ధి అజెండానే ప్రజలు కోరుకుంటా రన్న సత్యాన్ని గ్ర#హంచి అడుగులు వేయాలి. ఇది నిపుణుల సూచన. కాంగ్రెస్‌ శ్రేణులు కూడా అదే కోరుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement