Friday, November 22, 2024

Exclusive – “పవర్ స్టార్” ద‌ గేమ్ చేంజర్ – దిస్ ఈజ్ “పవనిజం”

పవర్ ‘స్టార్’ పాత్రకు న్యాయం చేసిన పవన్
జనసేనాని మాటతో అనేక మెట్లు దిగివచ్చిన బీజేపీ
టీడీపీతో పొత్తుకు కూడా అందుకే అంగీకారం
పార్టీలో భిన్నాభిప్రాయాలున్నా ఒకె చెప్పిన మోదీ, షా
టీడీపీ ఎన్​డీఏలో చేరడంలో పవన్​దే కీ రోల్
పవన్​ మాటకు గౌరవం ఇవ్వాలని మోదీ స్పష్టమైన సంకేతాలు
కూటమి కోసం పార్టీ పరంగా ఎన్నో త్యాగాలు
సీట్ల విషయంలో బేషజాలకు పోకుండా బీజేపీతో ఒప్పందం
ఏపీలో పోత్తు పొడుపు క్రెడిట్ అంతా సేనానిదే
పవర్​స్టార్​ని కేంద్ర మంత్రిగా చూడబోతున్న ప్యాన్స్
అమిత్ షా నుంచి స్పష్టమైన సంకేతాలు
అందుకనే కాకినాడ బరిలోకి దిగనున్న పవన్
జనసేన, టీడీపీ, బీజేపీ కేడర్ మనసు దోచుకుంటున్న పవన్

పసునూరి భాస్కర్​ – న్యూస్​ నెట్​వర్క్​ ఇన్​చార్జి, ఆంధ్రప్రభ

ట్వింకిల్.. ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యూ ఆర్, అప్ ఎబౌ ది వరల్డ్ సో హై… లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై …ఈ మాటలు, పాటలు మనిషి జీవిత సత్యాలే. ఔను జనసేనాధిపతి కొణిదల పవన్ కళ్యాణ్ ఇప్పుడొక పవర్ స్టార్. భారత రాజకీయ వినీలాకాశంలో తణుకు తణుకుమని మెరుస్తన్న అధికార ధ్రువ నక్షత్రం. సర్వ మానవ సమానత్వ హితులు.. ముగ్గురు జ్ఙానులకు తూర్పు దిక్కున దేదీప్యమాన దారి చూపిన ధ్రువతారే.. ఈ పవర్ స్టార్. ఔను నాయకత్వానికి అసలు సిసలు నిర్వచనం అతడే. ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు నెగ్గాలో తెలుసని మరోసారి నిరూపించాడు. తన వ్యూహాత్మక అడుగుల్లో ఆంధ్రా పవర్ స్టార్… ఇప్పడు జాతీయ నాయకుడిగా అవతరించనున్నారు. ఇదే నిజం.. పవనిజం!

ఔను.. ఈ పవనన్న లిటిల్ స్టారే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం.. ప్రేమ,సేవా నినాదంతో మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో తిరుపతి వేంకన్న సన్నిధిలో పురుడు పోసుకున్న ప్రజారాజ్యం పార్టీలో యువ సేనానిగా రాజకీయ తెరమీదకు వచ్చిన పవన్ కళ్యాణ్.. 2009ఎన్నికల ఫలితాల పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విలీనాన్ని తిరస్కరించి మౌన పాత్ర పోషించారు. అయిదేళ్లు తన నాయకత్వ లక్షణాలకు గట్టి పునాది వేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తీరుకు తల్లడిల్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికార కాంక్షతో రాజకీయ చదరంగంలో జరిగిన అన్యాయాలకు తల్లడిల్లిపోయారు.

2014లో జనసేన ఆవిర్భావం..
2014, మార్చి14వ తేదీన మరో అద్భుతం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇతర పార్టీల లీడర్లు, ముఖ్య నేతలు పవన్ కల్యాణ్పై అప్పుడే విమర్శల దాడి మొదలెట్టారు. అయితే.. రాజకీయాల్లో ఓనమాలు తెలియని నేతగా ఎన్నో ఈసడింపులు, చీత్కారాలను పవన్ కళ్యాణ్ చిరునవ్వతో ఓర్చుకున్నారు. ఎదిగే కొద్దీ ఒదగాలనే స్ఫూర్తిగా తన జన సైన్య కవాతుకు సేనానిగా అవతరించారు.

అభిమాన సైన్యంతోనే జనసేనకు పునాది

యే మేరా జహాన్ హా యే మేరా ఘర్ మేర ఆషియా.. యే మేరి దునియా తేరా కామ్ క్యా హై యహా.. అంటూ జనసేనసైన్యం కదం తొక్కింది. ఇక్కడ ఒక్కటే.. ఒక్కడే నాయకుడు. అదీ పవనిజం, హీరోయిజం. ఈ సైన్యం ఓటు బ్యాంకు కాదు. ఓట్ల పండుగలో సందడి చేసే బలం కాదని రాజకీయ పండితులు పదే పదే వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. అయినా సరే అవేవీ పట్టించుకోకుండా ఇక్కడే పవన్ కళ్యాణ్ అసలు నాయకత్వ లక్షణం బయటపడింది. తనకు అధికారం ముఖ్యం కాదు. ప్రజాక్షేమం ప్రధానం. ఏపీ విభజనతో రాజధాని లేదు. ఖజానాలో చిల్లిగవ్వ లేదు. జనం బతికేది ఎలా? అని ఆలోచించారు.

కాంగ్రెస్కు వ్యతిరేకంగా..

2014 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. కారణం తాను పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకి. ప్రజారాజ్యం పార్టీని సమాధి చేసిందనే ఆక్రోశం. ఇక వైసీపీ.. ఇది కూడా కాంగ్రెస్ తానులో ముక్కే. ఇదీ ఆయన ఆలోచన. అందుకే తెలుగుదేశం, బీజేపీకి జనసైన్యాన్ని అప్పగించారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. ఇక.. పవన్ కళ్యాణ్ స్వామి కార్యం నెరవేరిందని రాజకీయ పార్టీలు విశ్లేషణల మీద విశ్లేషణలు కుమ్మరించాయి.

జనసేన అమ్ములపొదిలో ఉద్ధానం ఉద్యమం
నలబై ఏళ్లుగా దీర్ఘకాల మూత్ర పిండ వ్యాధి రక్కసి కబంధ హస్తాల్లో నలిగిన ఉద్దానం గ్రామ పరిస్థితిపై 2017 జనవరిలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గొంతు విప్పారు. ఇక్కడి దారుణ పరిస్థితిని ఘోషించారు. ఫలితంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనానికి మార్గం వేస్తే.. నేటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టింది, ఈ రెండు అధికార పార్టీలు ఏమీ చేసినా… ఈ సమస్యను వెలుగులోకి తీసుకు వచ్చి.. సమాజానికి వివరించి.. పాలకుల గుండెల్లో గంగవెర్రులెత్తించిన ఘనత పవన్ కళ్యాణ్దే. ఇక ఇప్పటంలో పాలక వర్గాల దౌర్జన్య కాండను ప్రశ్నించి ఏపీలో మరో చరిత్ర సృష్టించారు. ప్రజల మధ్యనే ప్రజల సమస్యలకు, పరిష్కారానికి వారధిగా జనసేన ఆవర్భవించింది.

- Advertisement -

సొంత బలగం… బలం తేల్చుకునేందుకే
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన తొలి ఏపీ ఎన్నికల్లో జన సేన పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సమాధి లక్ష్యంతో టీడీపీ, బీజేపీకి పవన్ కళ్యాణ్ బేషరతు మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఊడ్చిపారేస్తే.. కాంగ్రెస్ తానులో ముక్క వైసీపీ ప్రతిపక్ష హోదా లభించింది. ఇక జనసేన బలం ఏంటో తేలాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. 2019లో అటు బీజేపీ, ఇటు టీడీపీ చేసిన నయవంచనను గమనించి.. తన సొంత బలాన్ని బేరీజు వేసుకోవటానికి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. చెగువేర పోరాట స్ఫూర్తితో.. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ కూటమితో 175 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించారు. తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానల్లో ఓడిపోయారు. కడకు రాజోలు నియోజకవర్గం నుంచి గెలచిన ఒకే ఒక్క జన సైనికుడు ఆ తర్వాత అధికార పార్టీలోకి దూకేశారు. అయితే.. ఈ ఎన్నికల్లో 5.54 శాతంతో 17.50 లక్షల ఓట్లు జనసేనకు లభించాయి.

ఇక ఏపీలో చక్రం.. గిరగిరా
తెలంగాణలో బీజేపీతో జనసేన జత కలిసింది. ఇక్కడ జనసేన వ్యూహం ఫలించలేదు. తెలంగాణ ఓటర్లు అంతగా చనువు ఇవ్వలేదు. కానీ, ఇక్కడే జనసేన నేత వ్యూహం మలుపు తిరిగింది. బీజేపీతో స్నేహం బలపడింది. తన వ్యూహాలకు గౌరవం పెరిగింది. ఇందుకు బీజేపీ కొత్త ఆశలే కారణం. తెలంగాణలో శాసించే స్థాయికి వచ్చిన బీజేపీ.. ఆంధ్రప్రదేశ్లోనూ పునాదిని పటిష్టం చేసుకోవాలని ప్రధాని మోదీ ద్వయం నిర్ణయం తీసుకుంది. ఇందుకు పవన్ కళ్యాణ్ మాత్రమే సరికొత్త ఆయుధంగా భావించింది. త్రిపుర లాంటి మార్స్కిస్ట్ పార్టీ కంచుకోటను బీజేపీ ధ్వంసం చేయాటానికి ఒకటే కారణం. అక్కడి స్థానిక పార్టీలన్నింటినీ ఏకం చేయటమే. అంతే కాదు.. మణిపూర్, అస్సాంలోనూ ఇదే పాచిక పనిచేసింది. ఏపీలో సుస్థితరత్వమే కాదు.. శాసించే శక్తికి ఎదగాలంటే, టీడీపీతో మిత్రలాభం పని చేయదు. దేశభక్తితో పాటు అభివృద్ధే లక్ష్యం కలిగిన జనసేన తమ తురుపు ముక్కగా భావించి.. ఈ ఎన్నికల్లోనూ టీడీపీతో జత కలిసేందుకు అంగీకరించింది. వాస్తవానికి బీజేపీతో జనసేన కలిసినప్పుడే ఏపీలో వైసీపీని ఏకాకి చేయటానికి టీడీపీ తన శక్తి యుక్తుల్ని వినియోగించి జనసేన, బీజేపీతో కలుస్తుందని రెండేళ్ల కిందటే రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు.

ఇదే కీలక ట్విస్ట్ ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసించే తమ నాయకుడి కోసం ఎదురుచూస్తున్న కాపు సామాజిక వర్గం అంతర్లీన మార్పు వచ్చింది. ఈ సారి తమ నాయకుడిని అధినాయకుడిగా చూడాలని పరితపిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కూడా ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలి, తమ గళం విప్పాలనే ఏకకై కోరికతో మిత్రపక్షం వైపు అడుగులు వేశారు. ఏపీలో తమ సామాజిక వర్గం బలం ఎక్కువని, అందరం గెలిస్తే అధికార పీఠం ఖాయమని కాపు వృద్ధులు, వయోవృద్ధులు గళం విప్పారు. ఎన్నో ఎన్నెన్నో సలహాలు ఇచ్చారు. ఇవన్నీ తమ వారసుల రాజకీ లబ్ధి కోసమని పవన్ కళ్యాణ్ ఇట్టే గ్రహించారు. ఈ స్థితిలో కాపు సామాజిక వర్గంలోనూ కాస్త ఇబ్బంది తప్పలేదు. కానీ, 24 సీట్ల ఒప్పందానికి అంగీకారం తెలిపారు. అంతే ఏపీలో అంతర్గత కలహాల గోల తప్పలేదు. త్యాగం చేసినోళ్లకే తన గుండెలో స్థానం అని పవన్ భీష్మించారు. ఇంతలోనే కేంద్ర రాజకీయాల్లో అనూహ్య మలుపు తెరమీదకు వచ్చింది.
బీజేపీ ఏకైక లక్ష్యం అదే..
కేంద్రంలో 370 లక్ష్యంతో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ప్రధాని జోస్యంపై రాజకీయ ఔత్సాహికుల్లో నమ్మకం పెరిగింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు మోదీ, అమిత్షా, జేపీ నడ్డా తదితర నేతల అభిమానాన్ని చూరగొనటంతో.. ఇలా పవన్ చిటిక వేస్తే, అలా కేంద్రంలో కదలిక ఖాయమన్నది స్పష్టమయ్యింది. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరింది. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ తో ఎలాంటి ఇబ్బందులు ఉండవని బీజేపీ గట్టినమ్మకం. అందుకని బీజేపీ కోరికతో పవనన్న లోక్సభ స్థానంపై దృష్టి సారించారు. అలాగే తాను పోటీ చేయాలనుకున్న రెండు స్థానాల్లోనూ సీట్ల సర్దుపోటు రచ్చ సమసి పోయింది. ఈ వ్యూహంతోనే ఉభయ తారక మంత్రంతో జన సేనాధిపతి తన వ్యూహం పన్నినట్టు స్పష్టమవుతోంది.

పవర్ ‘స్టార్’ పాత్రకు న్యాయం

పవర్ స్టార్ పాత్రకు పవన్ కళ్యాణ్ తగిన న్యాయం చేసినట్టే. తొలుత టీడీపీతో పొత్తునకు భీష్మించిన బీజేపీ కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం అనేక మెట్లు దిగి వచ్చింది. టీడీసీతో పొత్తునకు తలూపింది. నిజానికి బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ పవన్ మాట కోసం ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ ముఖ్య నేతలు అమిత్ షా ఓకే చెప్పారు. అంతేకాకుండా ఎన్డీఏలో టీడీపీ చేరటానికి పవన్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఎన్డీఏలో నిజమైన ‘పవర్’ స్టార్​గా పవన్​కు గుర్తింపు లభించింది. అన్నిటికంటే పవన్ మాటకు గౌరవం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వటం గమనార్హం. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు కోసం పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా కూడా ఎన్నో త్యాగాలు చేశారు. సీట్ల విషయంలో బేషజాలకు పోకుండా. బీజేపీతో కలవడమే కీలకంగా భావించారు. సంస్థాగతంగా పార్టీలోని సామాజిక వర్గంలో విమర్శల వచ్చినా.. జనసేనాని ఎక్కడా రాజీ పడలేదు. బీజేపీ మద్దతు ఉంటేనే ఏపీ అభివృద్ది సాధ్యమని బలంగా నమ్మారు. బీజేపీతో పొత్తు కోసం ఎన్నోమెట్లు దిగొచ్చారు. ఏపీలో పోత్తు పొడుపు క్రెడిట్ అంతా పవర్ స్టార్ పవన్ దే అని చెప్పుకోవాలి. ఇక.. అసెంబ్లీలో అడుగుపెట్టటం మాత్రమే కాదు.. ఏకంగా కేంద్ర మంత్రిగా కూడా పవన్ ఉండబోతారని.. దీనికి అమిత్ షా వంటి పెద్ద నేతల నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకోసమే కాకినాడ నుంచి లోక్​సభ బరిలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నట్టు స్పష్టం అవుతోంది. రాజకీయ చదరంగంలో బలమైన వ్యూహాలతో ఎత్తులు వేసిన పవర్ స్టార్​ పవన్​ కళ్యాణ్​ని సొంతపార్టీ జనసైన్యమే కాదు.. టీడీపీ, బీజేపీ కేడర్ కూడా విపరీతంగా అభిమానిస్తోంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement