Tuesday, November 19, 2024

Exclusive on AI – మాన‌వ మేథ‌స్సుకు ఢోకా లేదు

ఈ ఉద్యోగాల్లో మనుషులను ఏఐ రిప్లేస్ చేయలేదు
టెక్నాల‌జీ పెరిగినా హ్యుమానిటీ ముఖ్యం
కృత్రిమ మేథ‌తో ఇక్క‌డే అస్స‌లు ప‌నే కాదు
మేథాశ‌క్తి రంగాల వారికి డౌట్స్ వ‌ద్దు
జ‌ర్న‌లిస్టులు, ఆర్టిస్టులు, క‌ళా నైపుణ్యం ఉన్న వారికి స‌రిలేరు
జాబ్ ప‌రంగా ఫుల్ సెక్యూరిటీ
ఈ ప‌ది రంగాల్లోనూ మేథాశ‌క్తి కీల‌కం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌: మార్కెట్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో కొత్త అనుమానాలు, భయాలు మొదలయ్యాయి. అనేక కీలక డొమైన్లలో మనుషులకు ప్రత్యామ్నాయంగా AI పనిచేస్తోంది. ప్రత్యేకించి ఇండియాలో AI అనేక పనులను ఆటోమేట్‌ చేయడం ద్వారా ఉపాధి రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తోంది. కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగుల స్థానాన్ని రీప్లేస్‌ చేసింది. అయితే.. AI – సంబంధిత రంగాల్లో కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందన్న వాదనలూ ఉన్నాయి. ఈ భయాల నేపథ్యంలో అసలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రీప్లేస్‌ చేయలేని జాబ్స్‌ ఉన్నాయా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. ఈ ప‌ది రంగాల్లో మాత్రం నిపుణులు, సామర్థ్యాలున్న వారిని AI కాదు కదా, అంతకు మించింది వచ్చినా రీప్లేస్‌ చేయలేదని నిపుణులు అంటున్నారు.

- Advertisement -

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఎంత అభివృద్ధి చెందినా కొన్ని వృత్తులకు మాత్రం ప్రత్యామ్నాయంగా మారలేకపోతోంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఆయా వృత్తుల్లో మానవులదే (హ్యూమ‌న్ రీసోర్స్‌)దే పైచేయిగా నిలుస్తోంది. సృజనాత్మకత, భావోద్వేగాలకు సంబంధించిన మేథ‌స్సు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ లాంటి ముఖ్యమైన ప‌ది పనుల్లో మనుషులను AI రీప్లేస్‌ చేయలేద‌ని తేలిపోయింది.

థెరపిస్టులు, కౌన్సిలర్లు

కృత్రిమ మేథ థెరపిస్టులు, కౌన్సెలింగ్‌ ఇచ్చేవారిని ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ రిప్లేస్‌ చేయలేదు. ట్రస్ట్‌, ఎమోషనల్‌ కనెక్షన్‌తో సంబంధం ఉన్న ఈ రెండు పనులను చేయడం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తరం కాద‌ని తేలిపోయింది. ఎందుకంటే చికిత్సకు సంబంధించిన పనులు, కౌన్సెలింగ్‌, సలహాలు ఇచ్చేందుకు మనసు, భావోద్వాగాలతో ముడిపడి ఉంటుంది కాబ‌ట్టి ఈ ప‌నుల‌ను ఏఐతో చేయ‌డం సాధ్యం కాని ప‌ని.

ఆర్టిస్టులు..

కళ అనేది చాలా ప్రత్యేకమైంది. మనుషులు మాత్రమే భావోద్వేగ పూరితమైన రియల్ ఆర్ట్‌ని సృష్టించగలరు. ఆర్ట్‌లో హ్యూమన్‌ టచ్‌ చూపించిన ప్రభావం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) చూపించలేదు. ఎందుకంటే కళాకారులకు ఉండే అంత అనుభవం AIకి ఉండదు. అందుక‌ని క‌ళా రంగంలోనూ ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌భావం ఉండ‌క‌పోవ‌చ్చు.

స్ట్రాటజిస్టులు, అనలిస్టులు..

వ్యూహకర్తలు, విశ్లేషకులు వారి సృజనాత్మకత, అంతర్‌ దృష్టి, వ్యూహాత్మక ఆలోచనలను ఉపయోగించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు వెల్లడిస్తారు. అయితే, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేవలం డేటాను మాత్రమే విశ్లేషిస్తుంది. మనిషిలాగా దూరదృష్టితో ఆలోచించలేదు. అందుక‌ని ఈ రంగంలోనూ ఏఐ జోక్యం ఉండ‌క‌పోవ‌చ్చు..

సైంటిస్టులు..

ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రతి టెక్నాలజీ వెనుక శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది. సైంటిస్టులు క్రిటికల్‌ థింకింగ్‌, అపారమైన నాలెడ్జ్‌తో సవాళ్లను అధిగమించే పనులు చేస్తారు. అధునాతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తారు. ఈ పనుల్లో మనుషులకు ఆర్టిపీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ సాయం చేయగలదే కానీ, పూర్తిస్థాయిలో సొంతంగా పనిచేయలేదు. కాబ‌ట‌ట్టి శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ ఏఐ మ‌నుగ‌డ ఉండ‌క‌పోవ‌చ్చు.

కస్టమర్‌ సర్వీసు ప్రతినిధులు

కస్టమర్ సర్వీసు అనేది చాలా సహనంతో కూడుకున్న పని. సంక్లిష్టమైన, భావోద్వేగ పరిస్థితులను కస్టమర్ సర్వీసు ప్రతినిధులు హ్యాండిల్‌ చేస్తుంటారు. AI సాధారణ సలహాలు ఇవ్వగలదే కానీ, వేర్వేరు సంక్లిష్టమైన పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించడం, నిర్ధారించడం లాంటి పనులను చేయలేదు. ఇందుకోసం హ్యూమన్‌ బ్రెయిన్‌ అవసరం. ఇక‌.. ఈ రంగంలోనూ ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉప‌యోగం ఉండ‌క‌పోవ‌చ్చు.

సర్జన్స్‌, హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌

వైద్య నిపుణులు, సర్జన్లు ఒత్తిడిలో పనిచేస్టుంటారు. క్రిటికల్‌ స్టేజ్‌లో ఉండే పేషెంట్లకు కూడా తమ వృత్తి నైపుణ్యంతో చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకొస్తారు. మానవ శరీర నిర్మాణానికి సంబంధించి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం మానవ నైపుణ్యమే అవసరం అవుతుంది. అయితే.. ఈ పనుల్లో మనుషులకు ఏఐ సహకరించగలదే కానీ, ప్రత్యామ్నాయంగా మారలేదు.

ప్రొఫెషనల్ అథ్లెట్లు..

ఫిజికల్‌ స్కిల్స్‌తో పాటు స్ట్రాటజీ, పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించడం క్రీడల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. క్రీడల్లో మానవ స్ఫూర్తి, అంకితభావం, పనితీరును AI రీప్లేస్‌ చేయలేదు.

మీడియా, జర్నలిస్టులు

నిజానిజాలను వెలికితీయడం, వ్యవస్థలను జవాబుదారీగా ఉంచడంలో మీడియా, జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. మనుషులతో కనెక్ట్‌ అయ్యే, ఇంకా సంక్లిష్టమైన కథనాలను ఆకర్షణీయంగా అర్థమయ్యేలా చెప్పగల సామర్థ్యం కేవ‌లం మనుషులకే ఉంటుంది. అందులో జర్నలిస్టులను ఆర్టిపీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ రీప్లేస్ చేస్తుంద‌నేది అసాధ్యం.

టీచర్లు..

సమర్థులైన భావి పౌరులను తీర్చిదిద్ది, వివిధ వృత్తుల్లో నిపుణులకు పునాది వేసేవారు ఉపాధ్యాయులు. అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను ప్రోత్సహించడం, గైడెన్స్‌ అందించడం వంటివి ఎడ్యుకేషన్‌ రంగంలో కీలక భూమికగా ఉంటుంది. విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు విద్యా బోధనలో లోతైన మానవ స్పర్శ, వ్యక్తిగత సంబంధాలు అవసరం. ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చేయలేని పని అని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement