అన్న ఇంటికి కుటుంబ సమేతంగా వచ్చిన జనసేనాని
తల్లికి పాదాబివందనంతో ఆశీస్సులు
చిరంజీవికి సాష్టాంగ ప్రణామం
వదినతో ఆత్మీయ ఆలింగనం
పవన్ కు నిలువెత్తు పూలదండతో మెగాస్టార్ సత్కారం ..
మెగా ఫ్యామిలీ సమక్షంలో కేక్ కటింగ్
ఎపిలో ఎన్నికలల ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు.. నేటి సాయంత్రం భార్య, కుమారుడితో కలసి మెగాస్టార్ ఇంటికి వచ్చారు.. కారు దిగిన పవన్ కుటుంబాన్ని మెగా ఫ్యామిలీ అప్యాయంగా పలకించింది.. ముందుగా తల్లి పవన్ కు దిష్టి తీసింది.. అనంతరం వదినను అత్మీయ అలింగనం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నారు పవర్ స్టార్.. ఆ తర్వాత అన్న చిరంజీవికి సాష్టాంగ ప్రణామం చేశారు .. ఆ సందర్బంగా పవన్ కు నిలువెత్తు పూల దండతో మెగాస్టార్ సత్కరించారు.
మొత్తం మెగా ఫ్యామిలీ సమక్షంలో పవన్ తో కేక్ కట్ చేయించారు చిరంజీవి.. అలాగే పవన్ సోదరిమణులు కూడా తమ ఆశీస్సులను అందించారు.. అనంతరం అందరూ కలిసి గ్రూఫ్ ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక, నాగబాబు, తదితరులు పాల్గొన్నారు..