Monday, November 18, 2024

Exclusive – గీత దాటొద్దు – నేత‌ల‌లో ఓ”ట”డర్

నిజాయితీగా ఉండాలి
అక్రమాలకు తావివ్వొద్దు
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
ప్రజలకందుబాటులో ఉండాలి
ప్రజాసమస్యలపై స్పందించాలి
అభివద్ధి, సంక్షేమమే కాదు
ప్రజలతో మమేకమై ఉండాలి

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌) హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:


మాయచేసి… మభ్యపెట్టి… తాయిలాలు ఇచ్చి… నోట్లు పంచి… మందు పోసి ఓటర్లను ఆకట్టు’కొనే’ రోజులు పోయాయ్‌! ప్రజలు విజ్ఞులు… అన్నీ ఆలోచిస్తున్నారు… ఏది మంచి నిర్ణయమో గమనిస్తున్నారు… నాయకులు, ప్రజాప్రతినిధులకంటే ప్రజల ఆలోచనలు చాలా వేగంగా మారిపోతున్నాయి… భవిష్యత్‌ ఎలా ఉండాలనేది ఓ ఆలోచనతో ముందుకెళ్తున్నారు… ప్రజల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా నాయకులు, ప్రజాప్రతినిధులు పనులు చేస్తూ, సేవలందిస్తేనే ఆదరిస్తారు… ఎన్నికల్లో విజయం సాధించాం… ఇంకేమని… ఇవన్నీ పక్కనబెట్టి లేదా ఎంజాయ్‌ చేసినా గత ఐదేళ్లుగా తమకేం లాభించింది. జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరిగాయి అనే… నేడు ఓటరు ఆలోచిస్తున్నాడు. ఒక వైపు సంక్షేమ కబుర్లు చెప్పి మరో వైపు జేబుకు చిల్లుపెట్టే ఆలోచనలకు చెక్‌ పెట్టేస్తున్నారు. నవతరం నేతలు నేర్చుకోవాల్సింది. భవిష్యత్‌ తరాలకు కావాల్సింది ఎలా సేవలు అందించడమో చెప్పగలగడం… చేసి చూపించడం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎవరూ ఊహించలేనంత భిన్నంగా ఉం టోంది. ఇటీవల జరిగిన అసెంబ్లిd, లోక్‌సభ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. రాష్ట్రాభి వృద్ధి, దేశాభివృద్ధి కోసం ఎంతో చేశాం… సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి అమలు చేశాం… గెలుపు మాదే అనే ధీమా ఉన్న మహామహ పార్టీలు, నేతలు మట్టికరిచారు. ప్రభు త్వాలు కూలిపోయాయి. ఈ ఫలి తాల తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తే… ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధి, సంక్షేమం ఒక్కటే కాదని తెలుస్తోంది. జనం వేరు, ప్రజాప్రతినిధులు వేరు కాదు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్క రిస్తూ మంచీచెడులు చూడాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలి… ఎక్కడ జరుగుతున్నా అడ్డుకట్ట వేయాలి. సహజవనరులను సొంత ఆస్తులుగా భావిస్తూ పరిరక్షించాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తితో, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి.

- Advertisement -

ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలి… అధికార దర్పం ప్రదర్శించ రాదు. మితిమీరిన అధికార దుర్వినియోగం కొంప ముంచేస్తు ంది. వ్యవస్థలను ధ్వంసం చేయడం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించకపోవడం, న్యాయ, చట్టపరమైన అంశాల్లోనూ తలదూర్చి తమకిష్టమొచ్చినట్లు వ్యవహరించడం ఇంటికి దారి వేసుకోవడమేనని గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్నాం కదా… తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంభావంతో వ్యవహరిస్తే పుట్టగతులు ఉండవు. ఇందులో ఏ ఒక్కటి అలక్ష్యం చేసినా జనం జీర్ణించుకోవడం లేదు… అవినీతిపరుల భరతం పడుతున్నారు. అక్రమార్కులకు గుణపాఠం చెబుతున్నారు. అలాగే ఓ పార్టీ తరఫున గెలిచి, మరో పార్టీలోకి ఫిరాయించినా… చిత్తుచిత్తుగా ఓడిస్తున్నారు. సహజ వనరులను దోచుకున్నోళ్లను పాతరేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే… సంక్షేమ పథకాలు అమలు చేసిినా కొందరు ఓడిపోతున్నారెందుకని ఆరా తీస్తే… ఆశ్చర్యకర అంశాలు వెలుగుచూస్తున్నాయి.

ప్రజల మధ్యనే ఉన్నా… అవినీతి, అక్రమాలకు పాల్పడటం, తస్మదీయులకే లబ్ధి చేకూర్చడం, అర్హులకు అందకుండా చేయడం, నిజాయతీగా వ్యవహరిం చకపోవడం లాంటి లోపాలను ప్రజలు చాలా సునిశితంగా పరిశీలించి ఎన్నికల్లో తమ ఓటు హక్కు ద్వారా తీర్పు ఇస్తున్నారు. ఇదేగాక నాయకుడి నడవడికను కూడా జనం పరిగణనలోకి తీసుకుంటున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో లేని వాళ్లనూ జనం పక్కన పెట్టేస్తున్నారు. తామంతా చేస్తున్నాం… ఇంకేమంటూ ఏసీ రూ ముల్లో గడుపుతున్న వారిని ఓట్లతో ఇంటికే పరిమితం చేస్తున్నారు… ఇప్పటికైనా ఓడిన పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఆత్మ విమర్శ చేసు కోవాలి. తమ ఓట మికి కారణాలేమిటో గుర్తించాలి. ప్రజ లకు పార్టీకి మధ్య బంధమెందుకు తెగిపోయిందో గ్రహించాలి. అధికార దర్పం ప్రదర్శించామా? మితిమీరి అధికార దుర్వినియోగం చేశామా? వ్యవస్థల ధ్వంసం చేశామా? ప్రజాస్వామ్య స్ఫూర్తిగా వ్యవహరించలేదా? ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతినేలా తమ చర్యలున్నాయా? న్యాయ, చట్టపరమైన అంశాల్లోనూ తలదూర్చి తమకిష్టమొచ్చినట్లు వ్యవహరిం చామా? తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంభా వంతో పనులేమైనా చేశామా? ఆధిపత్య భావజాలం ఏమైనా ఉందా? లేదా తమ పనిలో తప్పుందా? ఆహార్యంలో మార్పు చేసుకోవాలా? ఇత్యాది అంశాలను సరిదిద్దుకోవాలి. జనం ఏం కోరుకుంటున్నారో గమనించాలి.

గతానికి భిన్నంగా వ్యవహరించాలి. తప్పులు సరిదిద్దుకోవాలి. ఓడితే ప్రజలపై నిందలేయడం, ప్రత్యర్థులపై విమర్శలూ సరికాదు. తామేం చేశామో మనస్సాక్షిగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. తాము సచ్చీలురం అని గొప్పలు చెప్పకోవడం కాదు… దాన్ని ప్రజ లలో నిరూపించుకోవాలి. ఇదే నేడు జనం కోరుకుంటు న్నారు… ఆ దిశగా ఓడిన పార్టీలు, నేతలు, ప్రజాప్రతినిధులు ఆత్మవిమర్శ చేసుకుని ముందుకెళ్లాలి… గెలిచిన వాళ్లూ ఇవే అంశాలను నిరంతరం యాదిలో ఉంచుకోవాలని సామాజిక వాదులు, రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement