Thursday, September 19, 2024

Exclusive – పాలిటిక్స్ కి తలొగ్గారు…అందుకే ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌కు తలవొంపులు

ఐపీఎస్ అధికారి ఓ వ్య‌క్తిపై త‌ప్పుడు కేసు బ‌నాయించిన ఘ‌ట‌న‌ దేశ చరిత్రలోనే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే.. ఆ కేసులో ఐపీఎస్ ఆఫీస‌ర్‌దే త‌ప్ప‌ని, దోషిగా తేల‌డంతో అత‌నికి 20 ఏళ్ల జైలు శిక్షను ముంబ‌యి కోర్టు విధించింది. ఇదీ మన చట్టం, న్యాయం, ధర్మం అసలు సిసలు స్వరూపం. ఇక.. ఏపీలో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు అక్రమార్కులుగా ప్రజాకోర్టులో నిలబడ్డారు. వీరిపై త్వరలోనే కేసులు నమోదు అవుతాయా? అరెస్టు జరుగుతుందా? అనే చ‌ర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరంతా మంచి ఆఫీస‌ర్లే అయినా.. రాజకీయ వలలో చిక్కుకున్నారనే ఉదారత ఒక‌వైపు ఉంటే.. వీరి అత్యుత్సాహం తీరును ప్రజలు నిలదీస్తున్నారు. అధికార పార్టీ నాయకుడికి ఎందుకు లొంగారు? పోలీసు ప్రతిష్టను ఎందుకు దిగజార్చారు? ప్రజాసేవను విస్మరించి.. రాజకీయ నాయకులకు తొత్తులుగా మారుతారా? అనే ప్రశ్నలన్నీ సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. సినీ నటి కాదంబరి జ‌త్వానీ.. ఢిల్లీ పారిశ్రామిక వేత్త మధ్య జగడం మంటలు ఏపీకి చేరి.. ఇక్కడి పోలీసుల కెరీర్‌నే ధ్వంసం చేసిందనేది జనం భావన అంద‌రిలో ఉంది. రెండు రోజులుగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ పనితీరుపై అంతులేని చర్చకు దారి తీసింది. ======================

ఐపీఎస్లకు తప్పనితిప్ప‌లు

దోషిగా తేలితే శిక్ష త‌ప్ప‌దు

లీడ‌ర్ల‌కు లొంగిపోవ‌డ‌మే కార‌ణమా?

ఈ బాగోతంలో అసలు కుట్ర ఎవ‌రిది

- Advertisement -

రాజ‌కీయ నేత‌లా.. పోలీసు ఆఫీస‌ర్లా?

ప్రజల గుండెల్లో ప్రశ్నల మంటలు

ముంబ‌యి ఐపీఎస్ కేసులో ఏం జ‌రిగింది?

20 ఏళ్ల జైలు శిక్ష వివ‌రాలపైనా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ :కాదంబరి జ‌త్వానీపై కేసు.. అరెస్టు వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు అడ్డంగా దొరికిపోయారా? ఏమో జనం అడిగి ప్రశ్నలతో ఇది నిజమే అనే డౌటనుమానాలు తప్పటం లేదు. ఒక రాష్టంలోని నిందితులను అదుపులోకి తీసుకోవటం, అరెస్టు చేయటం సాధారణ విషయం కాదు. కానీ ఇక్కడ ముగ్గురు ఐపీఎస్లు దారి తప్పినట్టే కనిపిస్తోంది. తమపై ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలను పాటించామని అమాయకంగా ఈ ఆఫీసర్లు సమాధానం ఇస్తున్నారు.

అంటే పోలీసు వ్యవస్థలో ఇంకా హైరార్కీ నడుస్తోందా? కింది స్థాయి సిబ్బంది చట్టానికి తూట్లు పొడిచేస్తారా? ఎలాంటి లాభాపేక్షతో ఇలా లొంగిపోయారు? పరిధి దాట్టొచ్చా .. అరెస్టు చేయొచ్చా … ఏపీ పోలీసులు సినీ నటి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోకి తీసుకురావొచ్చా. విచారించవచ్చా? అప్పటికప్పుడు కేసు నమోదు చేసి.. తక్షణమే నిందితుల కోసం గాలించవచ్చా. అంటే ఆ కేసు త్రీవ్రతను పరిశీలించరా? ఒక తీవ్రవాదినో.. ఉగ్రవాదినో పట్టుకోవటానికీ .. రూల్స్ పాటించే పోలీసులు.. ఓ మహిళ.. సినీ నటీని కేవలం సివిల్ కేసులో అరెస్టు చేయటానికి ఈ ఆఫీసర్లకు అంత దూకుడు ..అంత ఉత్సాహం ఎందుకు కలిగింది?

నిజానికి తమ పరిధిలో లేని ఓ కరుడు గట్టిన నేరగాడిపై తమ ఇలాఖాలో కేసు నమోదు చేస్తే.. అతడిని పట్టుకునేందుకు .. సదరు నేరగాడి పరిధిలోని పోలీసుల సాయాన్ని తీసుకోవాలి. సరే కాదంబరి కేసు విషయంలో ముంబై పోలీసులు కూడా కోవర్టు ఆపరేషన్ లో సభ్యులు కావచ్చు. కానీ సీఆర్ పీసీలో పోలీసు అధికారాలు సదరు అధికార పరిధిలో మాత్రమే వర్తిస్తాయి.

ఈ విషయంలో ఓ చిన్న ఉదహారణ పరిశీలిస్తే.. కర్ణాటకకు చెందిన నలుగురు పోలీసు అధికారులు పీఐటీఏ ఆరోపణలపై మన పూజమ్‌ అనే వ్యక్తిని కేరళలో పట్టుకున్నారు. కానీ నిందితులు ఈ పోలీసు అధికారులపై దాడి చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ లు 353 (డ్యూటీలో ఉన్న అధికారిని అడ్డుకోవడం), 323,325 మరియు 307 ఇతర ఆరోపణలతో అభియోగాలు మోపారు. కిడ్నాప్ చేశార‌న్న‌ కోర్టు..కేరళ హైకోర్టు ఐపీసీ సెక్షన్ లు 353,307,325, 323 లఅభియోగాలను ఉపసంహరించింది.

పోలీసు అధికారులకు తమ అధికార పరిధికి వెలుపల అరెస్టు చేసే అధికారం లేదని, వీళ్లను పోలీసు అధికారులుగా పరిగణించలేం, కేరళ పోలీసులు హాజరుకానందున, తమను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తున్నారని భావించే అవకాశం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి స్థితిలో తమ పరిధి వెలుపల పోలీసులు చట్టాన్ని అమలు చేయడానికి – వారెంట్ ఉండాలి. ఈ విషయాన్ని సదరు పరిధిలోని పోలీసులకు తెలపాలి. అప్పుడే అసలు అరెస్టు చేయాలి.

మన ఐపీఎస్ లు చేసిందేమిటీ? ఫ్రిబవరి 2 ఉదయం 6.30 గంటలకు ఇబ్రహీం పట్నం పోలీసు స్టేషన్ 90/204 ఎఫ్ ఐ ఆర్ ప్రకారం, కాదంబరిపై ఐపీసీ 384, 385,386,388,420, 467, 471 రెడ్ విత్ 120 (బీ) సెక్షన్ లతో కేసు నమోదు చేశారు. ఈ సెక్షన ప్రకారం నిందితురాలికి తక్షణమే బెయిల్ రాదు ..కానీ బెయిల్ లభిస్తుంది.

అలాంటి కేసులో నిందితురాలిని తక్షణం అరెస్టు చేయటానికి విజయవాడ డీసీపీ టీమ్ 7.30 గంటలకు ముంబైకి విమానం ఎక్కింది. విమానం టిక్కెట్లు కూడా సొంత జేబులోవేనట, ఇందులోనూ మర్మముంది. ఒక రోజు ముందే ఒక సీఐ, ఎస్ఐ సహా డీసీపీకి విమానం టిక్కెట్లు ఎలా బుక్ చేశారు. కేసు నమోదు కు ముందే పక్కా ప్లాన్ చేశారని ఉన్నతాధికారులకు ఓ క్లారిటీ వచ్చింది.

డీజీపీ ఆదేశాల‌తోనే జ‌రిగిందా..సెర్చ్ వారెంట్ లేకుండా.. కోర్టు అనుమతి లేకుండా ఇంత దైర్యం వీళ్లకు ఎలా వచ్చింది. ఇంటర్ స్టేట్ వ్యవహారం కాబట్టి సీపీ ఈ విషయాన్ని డీజీపీకి చేరవేయాలి. అక్కడ నుంచే ప్రాసెస్ మొదలవుతుంది. హోం శాఖ చీప్ సెక్రటరీకి లేఖ వెళ్లాలి. ఆయన అనుమతి డీజీపీకి చేరాలి. డీజీపీ ఈ లేఖను ఐజీకి.. ఐజీ నుంచి డీఐజీకి.. అక్కడ నుంచి సీపీకి రావాలి. అనంతరం పోలీసుల సెర్చ్ కు పాస్ పోర్ట్ రెడీ చేయాలి. రానుబోను ఖర్చులకు ఈ పాస్ పోర్టు వినియోగించాలి.

ఇదేం ఖర్మమో.. మన విశాల్ గున్నీ అత్యుత్సాహంతో కనీసం మహిళ పోలీసులు లేకుండానే తుపాకీ జేబులో సర్దేశారట. విమానం ఎక్కారట? కాదంబరిని వీటిపిఎస్ గెస్ట్ హౌస్ కు తరలించారు. ఆ తరువాత హైడ్రామా తెలిసిందే. దర్యాప్తు విరామ సమయంలో మహిళ పోలీసు ఆఫీసరు తెరమీదకు వచ్చి.. తన సత్తా చాటారు.

కొత్త కేసులోనూ బైపాస్… తనపై కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి తప్పుడు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా అరెస్టు చేశారని, ఇంటిలెజన్సీ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ కాంత్రి రాణ, డీసీపీ విశాల్ గున్నీ కుట్రతోనే తనను వేధించారని కాదంబరి ఈనెల 13న ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అదే రోజు అర్ధరాత్రి 11.50 గంటలకు పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. కుక్కల విద్యాసాగర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొని.. ఐపీసీ సెక్షన్ లు 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, 120 (బీ) సహా 66 (ఏ) ఐటీ యాక్ట్ 2000 ప్రకారం కేసు నమోదు చేశారు. తమను వేధించారని పోలీసులపై ఫిర్యాదు చేసినట్టు ఆమె మీడియాకు కూడా చెప్పింది.

కానీ ఐఎఫ్ ఆర్ లో కేసు దర్యాప్తులో ఉందని స్టేటస్ ఇచ్చారు. అంతేగానీ ఆరుగురు పోలీసులను నిందితుల జాబితాలో చేర్చ లేదు. అంటే.. ముగ్గురు ఐపీఎస్ లు కేసు నుంచి తప్పించుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తప్పుడు కేసు తేలితే ఐపీఎస్ కీ జైలే..!ఒకవేళ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీఎస్ లపై కేసు నమోదు చేస్తే.. ఈ ఆఫీసర్లకు ఇబ్బంది తప్పదు. ఎందుకంటే.. ఒక ఐపీఎస్ అధికారి.. తన అధికారాన్ని ప్రయోగించి ఓ అమాయకుడిని నిర్బంధించి, తప్పుడు సాక్ష్యాలతో అరెస్టు చేస్తే.. ఆ అధికారిని చట్టం వదలదు. కోర్టు తీవ్రంగా స్పందిస్తుంది. సరీగా ఇదే జరిగింది.

దేశంలో తొలిసారిగా ఓ ఐపీఎస్ అధికారికి 20 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. 1996 డ్రగ్స్ ప్లాంటింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. రాజస్థాన్‌కు చెందిన న్యాయవాది సుమేర్‌ సింగ్ రాజ్‌పురోహిత్‌ను పాలన్‌పూర్ హోటల్ గదిలో ముందుగా డ్రగ్స్ పెట్టి.. మాదక ద్రవ్యాల కేసులో ఐపీఎస్ అధికారి ఇరికించారు. ఈ కేసులో ఆ అధికారి భట్‌ను దోషిగా కోర్టు నిర్ధారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement