Tuesday, November 19, 2024

Exclusive: ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం.. తీరం సేఫ్.. శ‌త్రుమూక‌ల‌కు ఇక వ‌ణుకే..

ఇండియ‌న్ నేవీకి న‌వంబ‌ర్ నెల ల్యాండ్‌మార్క్‌గా మార‌నుంది. ఇండియా ఫస్ట్ స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌గా రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్నం యుద్ధ‌ నౌక‌ రేపు జ‌ల ప్ర‌వేశం చేయ‌నుంది. ప్రాజెక్ట్‌-15బీలో భాగంగా నిర్మించిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నౌకను ఆదివారం ప్రారంభించ‌బోతున్న‌ట్టు అధికారులు తెలిపారు. ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో కమిషన్‌ వేడుక జరుగనుండగా.. కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరుకానున్నారు.

అలాగే 25న కల్వరి క్లాస్‌ సబ్‌ మెరైన్‌ వెలా నాల్గో సబ్‌మెరైన్‌ జలప్రవేశం చేయ‌నుంది. దీనికి చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కెప్టెన్‌ బీరేంద్ర సింగ్‌ మాట్లాడుతూ ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం కమిషనింగ్‌ కోసం సిద్ధంగా ఉన్నామన్నారు. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం షిప్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ చేయగా ముంబైలోని మజాగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిలెడ్‌ నిర్మించింది.

ప్రాజెక్టు-15బీలో భాగంగా నిర్మించిన నాలుగు నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్‌, ఇంఫాల్‌, సూరత్‌ పేర్లు పెట్టారు. వేలా కల్వరి క్లాస్ నాలుగో జలాంతర్గామి కాగా.. భారత అమ్ములపొదిలో మరో శక్తివంతమైన ఆయుధంగా నిలువనున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement