ఏడాది కాలంలో ప్రధాని మారే అవకాశాలు
థింక్ గ్లోబల్, వర్క్ లోకల్ అనేలా ఉండాలి
పవర్ షేరింగ్, ప్రాఫిట్ షేరింగ్‌లో మేమే బెటర్
ఇతర రాష్ట్రాలకు తెలంగాణ కాంగ్రెస్ మోడల్
తెలంగాణ కులగణ నేషనల్ కాంగ్రెస్‌కు ఆదర్శం
యూపీని మూడు రాష్ట్రాలుగా చేయొచ్చు
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి
తెలంగాణ అభివృద్ధి విషయంలో కేసీఆర్ బెస్ట్
రాజకీయంగా మాకు చాలా విభేదాలున్నాయి
ఐస్, నైస్ ఫార్ములా అంతా ప్రధాని మోదీ విధానం
ముస్లి, మైనార్టీలకు మేలు చేస్తే విమర్శిస్తున్నారు
గుజరాత్ మోడల్‌కు మేమే ప్రత్యామ్నాయం
ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని వివాదాలున్నాయి
సామరస్యంగా, సానుకూలంగా పరిష్కరించుకుంటాం
నేషనల్ మీడియాతో ఫటాపట్
ర్యాపిడ్ క్వశ్చన్స్‌కి సీఎం రేవంత్ సమాధానాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్:
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సహకరిస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ నుంచి ప్రధాని వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో పలు అంశాలను షేర్ చేసుకున్నారు. రాపిడ్ క్వశ్చన్స్‌కి అదే స్థాయిలో రేవంత్ సమాధానాలిచ్చారు. థింక్ గ్లోబల్.. వర్క్ లోకల్ అనే మాదిరిగా అధికారుల పనితీరు ఉండాలి.. అంతేకానీ ప్రతి దానికి సీఎం దగ్గరకు ఫైల్ తీసుకువచ్చే విధానం ఉండొదన్నారు. ఇక.. పవర్ షేరింగ్.. ప్రాపిట్ షేరింగ్ గురించి ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు తెలంగాణ కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాలని, కులగణన తెలంగాణ కాంగ్రెస్ నుంచి నేషనల్ కాంగ్రెస్ యూనిట్ తెలుసుకోవాలన్నారు. రాష్ట్రాలు విభజించాల్సిన అవసరం లేదని, చేయాలనుకుంటే ఉత్తరప్రదేశ్‌ను మూడుగా స్టేట్స్‌గా చేయొచ్చన్నారు.. అక్కడ 80 ఎంపీ సీట్లున్నాయి. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అవుతుందని వ్యాఖ్యానించారు. ‘‘ఇక.. చిన్న, చిన్న అంశాలకే ఉదాహారణకు మరమ్మతులకు సంబంధించి ₹20 వేల ఫైల్ నా దగ్గరకు వస్తోంది. ప్రభుత్వ వ్యవస్థలో ఇది మారాలి.. థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్.. దాని ప్రకారం గ్లోకల్ కావాలి. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ.. దీపికా పదుకొణెను చూడ్డానికి ప్రజలు వస్తారు. కానీ, వారిని చూసి ఓట్లు వేయరు.. ఓట్లు వేసే వారు వేరే ఉంటారు”అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే..
మా రాజకీయ వ్యవస్థ గురించి చెబుతున్నా. తొలుత రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో ఎన్.జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి చొరవ చూపారు. చంద్రబాబు హైటెక్ సిటీని.. ఐటీ కంపెనీలను అభివృద్ధి చేశారు. రాజశేఖర్ రెడ్డి అవుటర్ రింగు రోడ్డు.. ఎయిర్‌పోర్ట్.. ఐటీ, ఫార్మాలను ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరూ వాటిని కొనసాగించారు. కేసీఆర్, కేటీఆర్ ఎంతో కొంత చేస్తే వాటిని కొనసాగించడానికి నాకు ఇబ్బంది లేదు. మాకు రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు.. డెవలప్‌మెంట్‌లో విభేదాలు లేవు. మూసీ పునరుజ్జీవనం అనేది తెలంగాణకు జీవనరేఖ. మూసీ, ఈసా, గోదావరి, కృష్ణాను అనుసంధానించే వ్యవస్థ.. మేం ప్రపంచంతో పోటీ పడుతున్నాం.. ఇప్పటికే 11 నెలలు పూర్తయ్యాయి.. మరో తొమ్మిది సంవత్సరాల్లో అన్ని పూర్తి చేస్తాం.. రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు.. టీడీపీ 2004 నుంచి 2014 వరకు వైఎస్సార్ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం అంతా రెండుసార్లు వచ్చారు.. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వాటన్నింటిని పూర్తి చేస్తాం.
ఐస్, నైస్ ఫార్ములాతో మోదీ..
మోదీ ఐస్..నైస్ ఫార్మూలాతో ఉన్నారు.. ఐస్ అంటే ఇన్‌కంట్యాక్స్.. సీబీఐ..ఈడీ.. నైస్ అంటే నార్కొటిక్స్.. ఇన్‌కంట్యాక్స్.. సీబీఐ.. ఈడీ… మోదీ ఫార్మూలా గుజరాత్.. నాన్ గుజరాత్‌నే.. ఆట నిబంధనలు మారాలంటున్నా.. మోదీ, బీజేపీ ఆట నిబంధనలు మార్చారు.. సిద్ధాంతపరమైన ఎన్నికలు పోయాయి.. రైట్.. లైఫ్ట్.. సోషలిజం ఎటుపోయాయి.. హిందూయిజం అంటే ఇతర మతాలను వ్యతిరేకించడం కాదు. హిందూయిజం అంటే అందరినీ కలుపుకొని పోవడం.. ప్రతి వైరస్‌కు కొంత కాలానికి ఔషధం వస్తుంది. మోదీ వైరస్‌కు మేం ఔషధం తయారు చేస్తాం.. కొవిడ్ వచ్చి పోయింది.. కొన్ని రాష్ట్రాల్లో ముందుగా మార్పు వస్తుంది.. కొన్నింటిలో లేటుగా వస్తుంది..
వాళ్లకు మేలు చేస్తే తప్పుగా ప్రచారం..
మోదీ కేబినెట్‌లో ఒక్క ముస్లిం అయినా ఉన్నారా? 15 శాతం జనాభా ఉన్న వారికి ఒక్క కుర్చీ ఇవ్వరా? మేం ఒక్కటో రెండో పదవులిస్తే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ముస్లింలకు కాంగ్రెస్ అన్నీ చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు ఈ దేశ జనాభా కారా? భాగస్వాములు కారా? స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదా? ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడితే రేపు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ముస్లిం, క్రిస్టియన్లకు సీట్లు ఇవ్వమన్నాడు. ఆయన హిందువులకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. ఇది ఎక్కువ రోజులు నడవదు.
గుజరాత్ మోడల్‌కు మేమే ప్రత్యామ్నాయం..
తెలుగు ప్రజలు ఐటీ, ఫార్మాలో ప్రసిద్ధులు. ఔషధ ఉత్పత్తిలో 35 శాతం తెలంగాణ, హైదరాబాద్ చేస్తోంది. ఇప్పుడు మేం టూరిజం, మౌలిక వసతులపై దృష్టి పెడుతున్నాం. తెలంగాణను చైనా+1 గా మార్చాలనుకుంటున్నాం. అందుకే మౌలిక వసతులు సృష్టిస్తున్నాం.. తెలంగాణ రైజింగ్. ఇది గుజరాత్ మోడల్‌కు ప్రత్యామ్నాయం.. మేం అందరికీ అవకాశాలు ఇస్తాం…
కేసీఆర్ భేష్.. రాజకీయంగా వేరే..
కాంగ్రెస్‌లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కాగలరు. ఖర్గే అందుకు ఉదాహారణ.. రైతు బిడ్డ ముఖ్యమంత్రి కాగలడు.. అది రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. దేశ రాజకీయాలు నాశనం అయ్యాయంటే ఎలా.. వాటిని బాగు చేయాలి. ఏదైనా మన మైండ్ సెట్‌లో ఉంటుంది. యువత బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల రోజు హాలి డే గా తీసుకొనే వారికి ప్రశ్నించే హక్కు లేదు. అంతా యువత చేతిలో ఉంది. నేను పది నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చా. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. మేం ₹18 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశాం.. నేను రాజకీయాల్లో కొంత చేయడానికి వచ్చా.. 18 ఏళ్లలో ఎటువంటి అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయ్యా..
= టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సహకరిస్తే ఏడాదిలోనే కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి వస్తారు..
= బీజేపీ సాధించింది ఏం లేదు.. 96 శాతం హిందువులున్న హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలిచింది.
= హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి కొన్ని కారణాలు ఉండొచ్చు.
= కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం కావాలనే అక్కడి ప్రజలు బీజేపీని ఓడించారు.
= తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేశారు. తెలంగాణ అంటేనే సామాజిక న్యాయానికి, పోరాటాలకు మారు పేరు..
= భద్రాచలంలో రామమందిరం ఉంది. అది మాకు గర్వకారణం.. మోదీ, అమిత్ షా వచ్చి భద్రాచలం దర్శించుకుంటే నేను అయోధ్య మందిరం వెళ్లి దర్శించుకుంటా..
= ఏపీ, తెలంగాణ మధ్య సాగు నీరు.. ఇతర రాష్ట్ర విభజన సమస్యలున్నాయి.. మేం వాటిని పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. ప్రపంచంలో ఐటీ, ఫార్మాలో మేం ఉన్నాం.. మా సమస్యలపై ఇక్కడ పంచాయతీ పెట్టాలనుకోవడం లేదు.
= ఏబీవీపీ కమిట్‌మెంట్ ఫర్ ద నేషన్.. టీడీపీ కమిట్‌మెంట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ వెల్ఫేర్.. కాంగ్రెస్ సోషల్ జస్టిస్.. వాటితోనే ఇక్కడికి వచ్చా..
= పవర్ షేరింగ్.. ప్రాపిట్ షేరింగ్ ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు తెలంగాణ కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాలి..
= కుల గణన తెలంగాణ కాంగ్రెస్ నుంచి నేషనల్ కాంగ్రెస్ యూనిట్ తెలుసుకోవాలి.
= రాష్ట్రాలు విభజించాల్సిన అవసరం లేదు.. చేయాలనుకుంటే ఉత్తరప్రదేశ్‌ను మూడుగా చేయొచ్చు.. = 80 ఎంపీ సీట్లున్నాయి. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి, సంక్షేమం సాధ్యం…
= చిన్న, చిన్న అంశాలకే ఉదాహారణకు మరమ్మతులకు సంబంధించి ₹20 వేల ఫైల్ నా దగ్గరకు వస్తోంది.. ప్రభుత్వ వ్యవస్థలో ఇది మారాలి.. థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్.. దాని ప్రకారం గ్లోకల్ కావాలి…
= హార్డ్ వర్క్ స్వభావం వలనే పెద్ద పెద్ద ఇన్ ఫ్రా కంపెనీలు హైదరాబాద్ వస్తున్నాయి..
= అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ.. దీపికా పదుకొణ్ ను చూడడానికి ప్రజలు వస్తారు. ఓట్లు వేయరు.. ఓట్లు వేసే వారు వేరు..