Friday, November 22, 2024

Exclusive – ఢిల్లీలో చంద్రపవనం – బీజేపీకి అభయహస్తం

ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర
మోదీ స‌ర్కార్‌కు ఆక్సిజ‌న్‌గా మారే చాన్స్‌
అల‌ర్ట్ అయిన‌ కషాయ దళం
హుటాహుటిన రావాల‌ని పిలుపు
ఏపీకి ఇచ్చిన వరాలు తెరమీదకు
కీలక పదవులు కావాలంటున్న లీడ‌ర్లు
మోదీ, అమిత్ షాతో ఏపీ ద్వయం భేటీ

భారత తొలి ప్రధాని నెహ్రూ చరిత్రను తిరగరాయాలని ప్ర‌ధాని మోదీ ఉవ్వీళ్లూరుతున్నారు. పదిహేనేళ్ల సుదీర్ఘ పాలన రికార్డుని అందుకోవాలని ఉబలాట ప‌డుతున్నారు. కానీ, ఎన్నికల ఫలితాలు తేడాకొట్టాయి. ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీకి సగానికి సగం సీట్లల్లో దెబ్బ ప‌డింది. గతసారి పశ్చిమ బెంగాల్‌లో 22 సీట్లు సాధిస్తే.. ఈ సారి డజను సీట్లే దక్కాయి. అంటే ఇక్కడ పది సీట్లు తగ్గాయి. మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి మెజారిటీ సీట్లు కొల్లగొడితే.. ఈసారి శివసేన ఎన్సీపీ చీలిక పార్టీలు ఏమీ కాకుండా పోయాయి. బీజేపీకి ఈ విధంగా దెబ్బ గట్టిగా తగిలింది.

- Advertisement -

400 ప‌క్కా అన్న మోదీ..

తొలుత 370 గ్యారెంటీ అని మోత మోగించన మోదీ.. ఆ త‌ర్వాత 400 సీట్లు ఖాయమని ధీమా వ్య‌క్తం చేశారు. కానీ, ఇందుకు విరుద్ధంగా ఫలితాలు రావ‌డంతో ఎన్డీయే బలం. బలగాన్ని కాపాడుకోవటం ఎలా? అనే రాజకీయ మీమాంశతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మిత్రపక్షాలపై శత్రుపక్షాల నీడ పడకూడదనే ఆందోళన స్థితికి చేరింది. అవును.. 2019లో 304 సీట్లు సొంతంగా గెలుచుకున్న బీజేపీకి ఈసారి 238 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే 66 సీట్లకు భారీ గండి పడింది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 కావాలి. ఆల్రెడీ 298 స్థానాలు ఖాతాలో ఉన్నాయి. కానీ, ఈ బలాన్ని చెక్కుచెదరకుండా చూడాలంటే.. చంద్రబాబు లాంటి రాజకీయ చదరంగ ధీరుడిని వశం చేసుకోవాలి. అందుకు పవన్ క‌ళ్యాణ్ వంటి హనుమంతుడు చేతిలో ఉండాలి. ఇదీ కాషాయదళం ఎత్తుగడగా తెలుస్తోంది.

టీడీపీ, జేడీయూ కీల‌కం..

ఎన్డీయేలో పెద్ద పార్టీలను గ‌మ‌నిస్తే టీడీపీ 16 సీట్లతో, ఆ త‌ర్వాత 15 సీట్లతో జేడీయూ ఉంది. ఇక ఏపీ నుంచే జనసేన కూడా ఉంది. జనసేనకు రెండు సీట్లున్నాయి. ఇలా ఈ పార్టీలను కలుపుకుంటేనే మోదీ మూడోసారి ప్రధాని ముచ్చట తీరుతుంది. అంటే ఏపీ అతి కీలకం ఏకంగా 18 ఎంపీ సీట్లు పవన్ ప్లస్ బాబు దగ్గరున్నాయి. మరి వీరిద్దరి మద్దతుతో ఏపీకి మోదీ ఎలాంటి వరాలు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

బీజేపీకి ఆక్సిజన్‌గా..

ఏపీ నుంచి 22 మంది వైసీపీ ఎంపీలున్నా ఖాతరు చేసే స్థితి 2019లో లేదు. 2014లో చంద్రబాబుకు 15మంది ఎంపీలున్నా పట్టించుకోలేదు. కానీ, ఇపుడు అలా కాదు, మోదీ ప్రధాని సీటుకే ఏపీ సీట్లు ఆక్సిజన్‌గా మారుతున్నాయి. అవి లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు కాదు. మరి అంతటి ప్రాణ వాయువుని బీజేపీకి అందిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలే కీలకం. కానీ టీడీపీ, జనసేన ఊపిరి ఏపీకి పదేళ్లుగా పెండింగ్‌లోని విభజన హామీలు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు. వీటిలో ఏది తప్పినా.. ఏపీలో పసుపుసేనకు ఇబ్బందే. అందుకే చంద్రబాబు కానీ పవన్ కానీ ఎక్కడా తగ్గటానికి వీల్లేదనే భావన ఏపీ జ‌నంలో వ్యక్తమవుతోంది. బీజేపీ ఇప్పుడే వంగుతుందని, ఆ పార్టీకి కండిషనల్ గానే సపోర్ట్ ఇవ్వాలని ఏపీ విభజన హామీలు నెరవేర్చేంతవరకూ ప్రభుత్వంలో కూడా చేరకుండా ఈ పార్టీలు కట్టుబడి ఉండాలని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement