అంధ్రప్రదేశ్ పదవ తరగతి విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్తే. పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 11 పరీక్షలను ఆరుకు కుదించిన ప్రభుత్వం.. తాజాగా పదో తరగతి పరీక్షల రాత సమయం పెంచారు. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ప్రథమ, ద్వితీయ, తృతీయ భాషా పరీక్షలకు సమయం పెంచారు. గణితం, సామాజిక శాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలకు అరగంట సమయాన్ని పెంచారు. గణితం, సామాజిక శాస్త్రానికి 3 గంటల 15 నిమిషాల సమయం కల్పించారు. అలాగే.. భౌతికశాస్త్రం, జీవశాస్త్రానికి 2 గంటల 15 నిమిషాలు పెంచారు. కంపోజిట్ కోర్సులోని రెండో భాష పేపర్-2కు ఒక గంటా 45 నిమిషాలు పెంచారు. ఒకేషనల్ కోర్సు పరీక్షకు రెండు గంటల సమయం పెంచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement