Tuesday, November 26, 2024

మాజీ మంత్రి కొడాలి నానికి కిడ్నీ సర్జరీ.. రెండు..మూడు రోజుల్లో డిశ్చార్జ్

హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో వైసీపీ ఎమ్మెల్యే..మాజీ మంత్రి కొడాలినానికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని కొడాలి నానికి వైద్యులు సూచించారు. ఆ తర్వాత ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు నిర్వహించనున్నారు.ఆయనకు కిడ్నీలో రాళ్లు ఉండటంతో వైద్యులు సర్జరీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement