అమరావతి, ఆంధ్రప్రభ : క్రమం తప్పకుండా మాస్కులు ధరిస్తున్న వారి సంఖ్య తక్కువగా కనిపించడం, హ్యాండ్ శాని-టైజేషన్ తగ్గిపోవడం వంటివి మనకు రోజువారీ అనుభవంలోకి వస్తోంది. కరోనా ముప్పు ఇక తప్పినట్లే అన్నట్లుగా బహిరంగ ప్రదేశాల్లో చాలా మంది ప్రవర్తిస్తున్నారు. కోవిడ్ కేసులు తగ్గుదలతో ప్రస్తుతం మాస్కులు, శాని-టైజర్ల డిమాడ్ దాదాపు 50శాతం దాకా తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. ఈడిమాండ్ తగ్గుదలకు అనుగుణంగానే పెద్ద పెద్ద కుపెనీలు సైతం వీటి ఉత్పత్తిని నిలుపుదల చేయడమో లేక గణనీయంగా తగ్గించడమో చేసేశాయి. అంతేకాకుండా ఆన్‌లైన్ రి-టైల్ మార్కెట్‌లోనూ వీటి అమ్మకాలు 50 శాతం మేర పడిపోయినట్లు- మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత మార్చి నుండి సెంప్టెంబర్ మధ్యలో అత్యధిక డిమాండ్ ఉన్న వీటి విక్రయాలు క్రమంగా తగ్గి ప్రస్తుతం సగానికి పడిపోయాయి. గతంలో పీపీఈ కిట్లు-, ఫేస్ మాస్క్ ల తయారీకి పెట్టు-బడులు పెట్టిన కంపెనీలు కూడా క్రమేపీ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి.
పదిరెట్లు- పెరిగిన శానిటైజర్ల మార్కెట్
గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి మొదలవ్వక ముందు రూ.వంద కోట్లు- ఉన్న శానిటైజర్ల మార్కెట్ తర్వాత కోవిడ్ ఉధృతి పెరగడంతో ఎనిమిది నెలల కాలంలో అమాంతం రూ.వెయ్యి కోట్లకు పెరిగిపోయింది. 2020-21 అర్ధికసంవత్సరం తొలి త్రైమాసికంలోనే 350 రకాల శాని-టైజర్లు, పరిశుభ్రతకు సంబంధించిన కొత్త ఉత్పత్తులను వివిధ కంపెనీలు మార్కెట్‌లోకి తెచ్చాయి. వీటిలో శానిటే-షన్ స్ప్రేలు మొదలుకుని యాంటీ–బ్యాక్టీరియల్ వైప్స్ కూరగాయలు, పండ్లను కడిగేందుకు క్లీనర్లు, బట్టలకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేలా వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటు-లోకి వచ్చాయి. 150కు పైగా బ్రాండ్లు, కంపెనీలు హ్యాండ్ శాని-టైజర్ మార్కెట్‌లోకి గత మార్చిలోనే ప్రవేశించినట్టు- మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ మూడు నెలలుగా క్రమంగా డిమాండ్ తగ్గుదలతో వీటి ఉత్పత్తులను ఆయా కుపెనీలు తగ్గించేశాయి. కాని, శానిటైజర్లతో పాటు- గతఏదాది మధ్యలో ప్రారంభించిన వెజిటబుల్ క్లీనర్స్, సర్ఫేస్ డిజ్‌ఇన్‌ఫెక్టెంట్స్ వంటి హైజీన్ ప్రొడక్టుల ఉత్పత్తులు తగ్గించి, వీటిలో పెట్టిన పెట్టు-బడులను కొన్ని కంపెనీలు ఉపసంహరించుకుంటున్నట్టు తెలుస్తోంద. అయితే, రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడే వివిధ ఉత్పత్తులపై మాత్రం ఇంకా కొన్ని కంపెనీలు ప్రత్యేక దృష్టి కొనసాగిస్తున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే భావనలో ప్రజలు కరోనా జాగ్రత్తలను పాటించడం లేదని, అది సరికాదని వైద్య నిపుణులు పేర్కొంటు-న్నారు. ముప్పు పూర్తిగా తొలగి పోలేదని, ఈ గ్రత్తలు కొనసాగించాల్సిందేనని చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటిస్తేనే మంచిది..
వ్యాక్సినేషన్ వల్ల హెల్త్ కేర్ సిబ్బంది ఇంకో వేవ్ తీవ్రంగా వచ్చినా, కేసులు ఒక్కసారిగా పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ రంగ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నందున ఎలాంటి స్థితినైనా అధిగమించేందుకు ప్రంట్ -లైన్‌వర్కర్లు కూడా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్‌లో ఉన్నామనే భావనలో ఉన్నా ఇంకా అక్కడక్కడా కేసులు ఉన్నందున పూర్తిగా కరోనా నుంచి బయట పడ్డామని చెప్పలేమంటున్నారు. కేసులు తగ్గినంత మాత్రాన బాగా తగ్గినట్టు- కాదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్కులు ధరించడం, హ్యాండ్ శాని-టైజేషన్ చేసుకోవడంతోపాటు- వ్యక్తుల మధ్య అరడుగుల దూరం పాటించాలని వైద్య రంగనిపుణులు గట్టిగా సూచిస్తున్నారు.
మాస్కులు, శాని-టైజేషన్, తప్పనిసరి
ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటు-లోకి రావడం, మనదగ్గరే రెండు రకాల వ్యాక్సిన్లు తయారు కావడం, ఎన్ని కావాలంటే అన్ని అందుబాటు-లో ఉండడం చాలా ఉపయోగకరమని ప్రముఖ వైద్యుడు డా. మెహబూబ్ షేక్ చెబుతున్నారు. ఈ వైరస్ సోకి కోలుకున్నాక యాంటీ- బాడీస్ వృద్ధిచెందడం, ఇప్పటికే కొంత హెల్త్ ఇమ్యూనిటీ- ఏర్పడడం వల్ల.. ప్రజలు కొంత మెరుగైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. అయితే, ఇంకా కేసులు వస్తున్నందున ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి సూచించారు. ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదని, అందువల్ల అక్కడి వారు ఇక్కడికి వివిధ వ్యాపారాలు, ఉద్యోగాల రీత్యా వచ్చే అవకాశమున్నందున మాస్కులు, హాండ్ శాని-టైజేషన్, మనుషుల మనుషుల మధ్య దూరం పాడించడు వంటివి వ్యక్తిగతంగా కచ్చితంగా పాటించాలని నొక్చి చెప్పారు. జనాభాకు మరికొంత శాతం వ్యాక్సిన్ ఇచ్చాక అంతా పేపర్ జోన్‌లోకి వస్తారని, అప్పటిదాకా జాగ్రత్తలు పాటించడం మంచిదని సలహా ఇచ్చారు.