కర్నూలు, (ప్రభన్యూస్): వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 35,37, 38, 39,40 పోలింగ్ స్టేషన్‌లో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఎంత మంది ఓటు హక్కును నమోదు చేసుకున్నారన్న వివరాలను బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్-2022లో భాగంగా నూతనంగా ఓటరుగా నమోదు చేసుకొనుటకు, ఓటరు జాబితాల్లో పేర్లు ఉన్నా వారు మార్పులు, చేర్పులు చేసుకొనుటకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 30వ తేది వరకు నమోదు చేసుకొనుటకు గడువు ఉందని సూచించారు. ఓటరుగా ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ విధానంలోనూ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్‌సైబ్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. అవసరమైన పత్రాలతో పోలింగ్‌స్టేషన్‌కు వెళ్లి తప్పనిసరిగా తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలని కోరారు. ఆయన వెంట కర్నూలు అర్బన్, రూరల్ తహసీల్దార్లు , బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital