బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. ఇటీవలే రూ.50కే క్వార్టర్ మద్యాన్ని ఇస్తామంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై విమర్శల జల్లు కురిసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సోము వీర్రాజు తన మాటమీదే కట్టుబడి ఉంటున్నారు. ఆయనపై సామాజిక మాధ్యమాల్లో ‘సారాయి వీర్రాజు’, ‘అయ్యయ్యో వద్దమ్మా’, ‘మందు కావాలా నాయనా’ అంటూ నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఈ రోజు మరోసారి స్పందించారు. ”50 రూపాయలకు లిక్కర్ అమ్మితే ప్రతి పేదకుటుంబానికి ఏడాదికి 2 లక్షల రూపాయలు మిగులుతాయి.. నేను సారాయి వీర్రాజు కాదు.. బియ్యం వీర్రాజుని, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజుని.. నేను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024లో బీజేపీ మ్యానిఫెస్టోలో పెడతాం” అని సోము వీర్రాజు అన్నారు. అలాగే మరోవైపు, విశాఖలో కేజీహెచ్ ఆసుపత్రి పేరు వెంటనే మార్చాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అసలు కింగ్ జార్జ్ ఎవరని, ఇందులో కింగ్ ఎవరని ? జార్జ్ ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఈ పేరు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. కేజీహెచ్‌కు సర్ధార్ గౌతులచ్చన్న పేరు పెట్టాలని ఆయన అన్నారు. త్యాగశీలుర పేర్లు పెట్టాలని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital