Friday, October 18, 2024

AP: ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదు.. బుద్ధా వెంకన్న

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఏకధాటిగా ఛీకొట్టినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఐదు సంవత్సరాల పాటు అబద్ధాలతో పాలన చేసి.. మళ్లీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విష ప్రచారాలు చేయడంలో దిట్ట తెలిపారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చిన చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యమన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గ తన కార్యవర్గంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్పారు.

మచిలీపట్నంలో అత్యధిక మెజారిటీతో నిన్ను, నీ కొడుకుని ఓడిచ్చారని గుర్తు చేశారు. ప్రజలు ఛీ కొట్టినా వీళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే… జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్ మార్చారని ఆరోపించారు. ఆరు అడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే ఐదు అడుగుల తాచుపాము జగన్ అన్నారు. ఈ తాచుపాముకు తన మన బేధం‌లేదు.. ఎవరినైనా కాటేస్తాడన్నారు. చేయని తప్పుకు చంద్రబాబుకు కేసులు వేస్తే, దేశం మొత్తం, ఇతర దేశాల్లో స్థిరపడిన వారంతా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. మీరు చేసిన పిచ్చి పనులకు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారని, ఇంకా అబద్దాలతో‌ ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

నెల రోజుల్లోనే రాష్ట్రంలో మార్పు తెచ్చిన మనిషి చంద్రబాబు అని తెలిపారు. అధికారులతో సమీక్ష చేసి, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని, జగన్ ఐదేళ్లలో ఎప్పుడైనా అధికారులతో ఇలా మాట్లాడారా అని ప్రశ్నించారు. కమీషన్ లు, కాంట్రాక్టుల్లో మామూళ్ల కోసం జగన్ మీటింగ్ లు పెట్టాడన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో పీపీసీఎల్ తో పాటు మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. మీ జగన్ ను చూసి పారిశ్రామిక వేత్తలు‌ భయంతో వెళ్లిపోయారని, కియా, అమర్ రాజా కంపెనీ విషయంలో వాటాలు అడగలేదా అని ప్రశ్నించారు. మీ‌ వేధింపుల వల్లేగా వాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిందనీ, అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన మీరు ఇప్పుడు సిగ్గు, శరం‌ లేకుండా వాగుతున్నారని తెలిపారు.

- Advertisement -

చంద్రబాబు సంపద సృష్టిస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తప్పకుండా అమలు చేస్తారని చెప్పారు. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని వాగితే… రోడ్ల మీద తిరగలేరన్నారు. మీ రాక్షస పాలన తట్టుకోలేకే మళ్లీ చంద్రబాబు కావాలని‌ ప్రజలు గెలిపించారని, నెల రోజులకే గుండెలు బాదుకుంటే ఎలా… త్వరలోనే సుపారిపాలన ఎలా ఉంటుందో చంద్రబాబు చేతల్లో చూపిస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement