రామ సముద్రం, (ప్రభ న్యూస్) లంచం తీసుకున్నా పని సరిగ్గా చేయకపోవడంతో ఓ రైతు వీఆర్వోను నిలదీసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఇవ్వాల జరిగింది. 25వేలు లంచం తీసుకుని ఒన్లీ అడంగల్ మార్చారని రైతు వాపోయాడు. మదనపల్లె మండలం రామసముద్రం మండలంలోని మినికి పుచాయితీ రెవిన్యూ సంబంధించిన ఖాతా నెంబరు 1099 భూమిని 1ఎకరా 20 సెంట్ల భూమిని 25 వేల రూపాయలు లంచం తీసుకుని మార్చేశారు. మినిక విఆర్ఓ పాపారాయుడు డబ్బుకు కక్కూర్తిపడి ఇలా చేశాడని, మాలేనత్తం పంచాయతీ ఎరపుసెట్టిపల్లెకు చెందిన రెడ్డెప్పరెడ్డి మినికి విఆర్ఓ పాపారాయుడు ను తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, రైతులు ప్రజల సమక్షంలో విరుచుకుపడ్డారు.
తర్వాత విలేకరులతో మాట్లాడుతూ పాపారాయుడు పాపాలు అన్ని ఇన్ని కాదని, మినికి రెవిన్యూ గ్రామంలో చాలామంది రైతులు దగ్గర ఇలానే డబ్బులు తీసుకుని, రెండు, మూడు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగి పోయాయని కొందరు రైతులు విలేకరులతో మెరపెట్టుకున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ రామును వివరణ కోరగా తక్షణం విఆర్ఓ పాపారాయుడు పై చర్యతీసుకుని 24 గంటలలోపలే రైతు రెడ్డెప్ప రెడ్డికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మరి కొంతమంది రైతులు మాట్లాడుతూ రామ సముద్రం మండలంలోనే మరి కొందరు విఆర్ఓ లు ఇలానే రైతులు దగ్గర డబ్బులు తీసుకుని రెండు, మూడు సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వీరిపైన కూడా చర్యలు తీసుకోవాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు.