Friday, November 22, 2024

AP | ప్రజల‌ కోసం ఫిర్యాదు బాక్సులు : మంత్రి అనిత

ప్రజా సమస్యల పరిష్కారానికి నియోజకవర్గంలో ప్రత్యేక కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….

నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతి మండల కేంద్రంలోని ఎంఆర్‌ఓ, ఎంపీడీఓ, కళాశాలలు, ప్రధాన కూడళ్లలో కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మూడు, ఐదు రోజులకోసారి ఫిర్యాదుల పెట్టెను బయటకు తీసి వాటిని పరిశీలించి పరిష్కారానికి అధికారులకు పంపుతామన్నారు.

- Advertisement -

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు…

అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ లేఅవుట్లు, పేదల భూములను కబ్జా చేయడం వంటి ఘటనలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. నా పేరు చెప్పి పేదలకు ఇళ్లు, పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అందిస్తామని డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయింపులు జరపాలని, అందుకు విరుద్ధంగా ప్రవర్తించే అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement