Tuesday, November 26, 2024

తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్​.. భూ వివాదం కేసులో ఒకరి అరెస్ట్..

తిరుపతి సిటీ , ప్రభ న్యస్​: భూ అక్రమాలు.. అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఒక‌రిని అరెస్టు చేసినట్లు అలిపిరి సీఐ అబ్బన్న శనివారం తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన మేడ లోకేశ్‌పై 2017లో ధర్మవరం పోలీస్ స్టేషన్ లో భూ కబ్జా కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి క్రిమినల్ యాటిట్యూడ్ కలిగిన ఇత‌ను పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.

కాగా, ధర్మవరం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి శివజ్యోతి నగర్ నందిని అపార్ట్మెంట్‌లో రహస్యంగా ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో అత‌డిని అరెస్టు చేసిన‌ట్టు సీఐ తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో త‌ప్పుడు పోస్ట్ లు చేయ‌డం కూడా ఇత‌నికి అల‌వాటుగా మారిందన్నారు. కుట్ర కోణం.. బెదిరింపు వంటి వాటితో పాటు ల్యాండ్ గ్రాబింగ్ కేసులో ధర్మవరం కోర్టు నాన్ బెయిల్ వారెంట్ ఉంద‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement