అమరావతి, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోయారు… ప్రస్తుతం ఆయన డిఫాల్ట్ బెయిల్‌పై బయట ఉన్నారు. కాగా గంగిరెడ్డి బెయిల్‌ను ఇటీవల తెలంగాణా హైకోర్టు రద్దు చేసిన నేపధ్యంలో కోర్టు ఆదేశాలతో ఈనెల 5వ తేదీ శుక్రవారం కోర్టులో లొంగిపోవాలి ్స ఉంది. లేకుంటే అరెస్టు చేయాలని కోర్టు సీబిఐని ఆదేశించింది. ఈ నేపధ్యంలో వివేకా కేసులో కీలకమైన మొదటి నిందితునిగా ఉన్న గంగిరెడ్డి నేడు సిబిఐ కోర్టుకి వచ్చారు.. హైకోర్టు ఆదేశాలతో తాను లొంగిపోతున్నట్లు గంగిరెడ్డి ప్రకటించారు.. ఇక నుంచి జ్యుడీషియల్ రిమాండులోకి వెళ్ళనున్నారు.
బెయిల్‌పై ఉన్న గంగిరెడ్డిని అవసరమనుకుంటే సీబిఐ ప్రశ్నించే అవకాశం ఉన్నప్ప టికీ వివేకా కేసులో రోజురోజుకు మారుతున్న పరిణా మాల దృష్ట్యా తాజాగా కస్టడీ కోరే అవకాశం లేకపోలేదని న్యాయనిపుణుల అంచనా. వివేకానంద రెడ్డి హత్యకు పధక రచన జరిగిన మీదట దాన్ని అమలు చేసే విషయంలో ప్రధానంగా వ్యవహరించిన గంగిరెడ్డిని ఆయా ఆరోపణలపై 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డిని అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అరెస్ట్ చేసింది. ఆతర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పాటైన సిట్ సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డికి 2019 జూన్ 27న పులివెందుల కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువడ్డాక.. దర్యాప్తు తెలంగాణాకు మారాక అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తాజాగా భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిల అరెస్టు అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి న్యాయపరమైన అడ్డంకులు సీబి ఐ ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో గంగిరె డ్డి బెయిల్‌పై బయట ఉండటం కూడా ప్రస్తావనకు వచ్చింది. మొదటి నిందితుడు బెయిల్‌పై బయట ఉంటే దర్యాప్తుకు విఘాతం కలుగుతుందనే కోణంలో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం బెయిల్ రద్దు చేస్తూ ఏప్రిల్ 27న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మే 5 లోగా లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. లేని పక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సీబీఐకి సూచించింది. వివేకా కేసు దర్యాప్తు గడువును సుప్రీం కోర్టు జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో అప్పటివరకు మాత్రమే గంగిరెడ్డిని రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. జూన్ 30వ తేదీ తర్వాత బెయిల్ లభించేలా న్యాయస్ధానం ఉత్తర్వులు ఇచి ్చంది. ఈ నేపధ్యంలో గంగిరెడ్డి శుక్రవారం సీబిఐ ఎదుట లొంగిపోయారు..
వాచ్మెన్ భద్రత కోసమే..
వివేకా హత్య కేసులో తాజాగా మరో కీలక పరిణామం ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య ఆరోగ్యం విషమించడం. సీబిఐ దర్యాప్తులో రంగయ్య వాంగ్మూలమే కీలకం. దాని ఆధారంగానే అధికారులు ముందుకు వెళ్లగలిగారు. వివేకా హత్య చూసిన ప్రత్యక్ష సాక్షి రంగయ్య అని సీబిఐ చెబుతోంది. అతని సాక్ష్యాన్ని సీబిఐ మొదట్లోనే నమోదు చేసింది. ఆ తర్వాత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాలనే బెదిరింపులు, ఒత్తిళ్ళు కూడా రంగయ్య ఎదుర్కొన్నాడు. కాగా కాల క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్న క్రమంలో అది కాస్తా ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. వివేకా కేసులో కీలక పరిణామాలు ప్రస్తుతం వేగమందుకుంటున్న క్రమంలో ప్రత్యక్ష సాక్షి రంగయ్య సాక్ష్యం అత్యంత ప్రధానమైంది. కాబట్టి రం గయ్య ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆయన భద్రత అత్యంత ప్రధానమని భావించిన సీబి ఐ హైదరాబాద్ తరలించేందుకు సిద్ధమైంది. వివేకానందరెడ్డి హత్య జరిగిన 2019 మార్చి 15వ రోజు రాత్రి వాచ్మెన్ రంగయ్య అక్కడే ఉన్నట్లు సీబిఐ దర్యాప్తులో నమోదు చేసింది. రంగయ్య సాక్ష్యం ప్రాధాన్యత దృష్ట్యా అతని భద్రతపై సీబిఐ దృష్టి పెట్టింది.