Friday, November 22, 2024

Alur: అన్ని కులాలకు సమన్యాయం… మంత్రి జయరామ్

ఆలూరు ప్రభ న్యూస్… తమ పార్టీ అన్ని కులాలకు సమ న్యాయం చేసిందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. తమ పార్టీ ప్రజా సంక్షేమ పార్టీగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతిగా నిలబడ్డారని, అన్ని పదవులు అన్ని కులాలకు సామాజిక న్యాయం చేశారని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను 98% పూర్తి చేసామని తెలిపారు. మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలను ఇతర రాష్ట్రాల హామీలనే ఇవ్వడం జరిగిందని తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఎన్ని కల్లి బోల్లి మాటలు చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వ పాలనలో అందరూ సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు.రైతులకు మద్దతు ధర కల్పించడంలో, పంటల భీమా అందించడంలోనూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి నారాయణస్వామి, ఎంపీపీ భర్త శ్రీధర్, మండల కన్వీనర్ వీరేష్, బెల్టన్న సొసైటీ చైర్మన్ మల్లికార్జున, మండల కో కన్వీనర్ హనుమయ్య, ఎంపీపీ తనయుడు వీరేష్, మండల సచివాలయ కన్వీనర్ ఆరికేరి ఈరన్న, హోళ గుంద మండల వైఎస్ఆర్సిపి నాయకులు మల్లికార్జున, ఎంపిటిసి శివన్న, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎల్లప్ప, దీపక్, వెంకటేష్, వరుణ్, రాజశేఖర్, నియోజకవర్గ పరిధిలోని వైయస్సార్ సిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు , అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement