అమరావతి, ఆంధ్రప్రభ: మార్చిలో జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్(ఎన్‌ఎస్‌పీ)లో తమ వివరాలు నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానందరెడ్డి తెలిపారు. అలాగే స్కూలు లెవల్‌లో ధ్రువీకరణకు అక్టోబర్ 16 చివరి తేదీగా జాతీయ మానవ వనరుల శాఖ తెలియజేసిందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నమోదు చేయకుంటే వారికి ఇక ఎప్పటికీ ఏ విధంగా కూడా స్కాలర్షిప్ మంజూరు కాదని స్పష్టం చేశారు.
2021 ఫిబ్రవరి, 2018 నవంబరు, 2018 సంవత్సరాల్లో ఎంపికై ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కనుక ఎంపికైన ప్రతీ విద్యార్థి ఎట్టి పరిస్థితులలోనూ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకొని స్కాలర్షిప్ పొందాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని దేవానందరెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.