Tuesday, November 26, 2024

సంక్రాంతిలోగా ఇంజినీరింగ్‌ మూడో విడత కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా ఇంజినీరింగ్‌, డిగ్రీ మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించబోతున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి వెల్లడించారు. రెండో విడతనే తుది విడతగా నిర్వహించామని, అయితే అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన వేలాది వినతుల మేరకు సంక్రాంతిలోగా మూడో విడత పూర్తి చేయనున్నామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన గతేడాది నిర్వహించిన కార్యక్రమాలు, రాబోయే ఏడాదికి నిర్దేశించుకున్న లక్ష్యాలు వివరించారు. ఈ నెల 11 నుంచి ఆర్‌- సెట్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్‌ విపత్తులోనూ విద్యార్థులు అకడమిక్‌ ఇయర్‌ కోల్పోకుండా చర్యలు తీసుకున్నామని, జాతీయ నూతన విద్యావిధానాన్ని దేశంలోనే పూర్తిస్థాయిలో అమలు చేసి జీఈఆర్‌ మెరుగవుతున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందని వివరించారు. తద్వారా రెండేళ్లలో 60 వేల మంది విద్యార్థులు అదనంగా కళాశాలల్లో చేరారని తెలిపారు.

క్యూఏసీ ద్వారా అన్ని కళాశాలలకూ అక్రిడిటేషన్‌..
రాష్ట్రంలో ఆనర్స్‌ డిగ్రీలో పది నెలల ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టామని, మల్టిపుల్‌ ఎగ్జిట్‌ అవకాశం కల్పిస్తున్నామని హేమచంద్రారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యాప్లానింగ్‌ బోర్డును దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు చేసి, ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి కేంద్ర సంస్థలతో భాగస్వామ్యమవుతూ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement