Monday, October 21, 2024

Endowment Scams నిన్న శాంతి – నేడు వినోద్

ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – రాష్ట్ర దేవదాయ శాఖలో వరుస కుంభకోణాలు…వెలుగులోకి వస్తున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ శాంతి తర్వాత వెలుగులోకి మరో అసిస్టెంట్ కమిషనర్ భూ బాగోతాలు బయటకు వచ్చాయి.ఈ తరుణంలోనే దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ ఎత్తున భూకుంభకోణానికి పాల్పడ్డారని వినోద్ కుమార్ పై అభియోగం నమోదు చేసారు .

వినోద్ స్కాం లో చిట్టా

దేవదాయ శాఖ భూములకు నిబంధనలకు విరుద్దంగా ఎన్వోసీలు జారీ .

- Advertisement -

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో నాగ పడగల ప్రతిష్టలో స్కాం .నాగ ప్రతిష్ట స్కాంలో రూ. 68 లక్షల మేర అవినీతి .

విశాఖ, విజయనగరం జిల్లాల్లో దేవదాయ భూ కుంభకోణాలకు గత ప్రభుత్వ పెద్దలకు సహకరించారని వినోద్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక దీనిపై ఏసీబీ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement