Saturday, June 29, 2024

Encroachments – రాష్ట్రం నీ తాత జాగిరా…జ‌గ‌న్ పై నారా లోకేష్ గ‌రం గ‌రం

వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపుల వివరాలను మంత్రి నారా లోకేశ్ X వేదికగా పోస్ట్ చేశారు. జగన్ ప్యాలెస్ లు కట్టుకోవడానికి ఇదేమైనా నీ తాత జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


“జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ.600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?” అని నారా లోకేశ్ ఫైరయ్యారు.

- Advertisement -

ఇదిగో నీ క‌బ్జాల చిట్టా..

ఏలూరు రైల్వే స్టేషన్ కు కొద్దిదూరంలో ఉన్న ఒక క్రీడాప్రాధికార సంస్థకు చెందిన స్థలలం వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు అనే గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 1.50 ఎకరాలలో వైసీపీ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయం మాజీ మంత్రి ధర్మాన ఇంటికి అతి సమీపంలోనే ఉంది.

మరొకటి నెల్లూరు అర్బన్ పరిధిలోని వెంకటేశ్వరపురంకు సమీపంలో టిడ్కో ఇళ్లకు కేటాయించిన స్థలంలోనే వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టింది. రాయచోటిలో గయాళు భూములను క‌మ‌ర్షియ‌ల్ భూమిగా మార్చి నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కర్నూలు నడిబొడ్డున ఉన్న 5 రోడ్ల కూడలిలో రూ.100 కోట్ల విలువైన 1.60 ఎకరాల్లో వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో దీనిని ఏపీఆగ్రోస్ కు కేటాయించగా తిరిగి వైసీపీకి ఇచ్చారు.

అనంతపురం హెచ్ ఎల్ సి కాలనీలో జలవనరులశాఖకు చెందిన భూమిలో వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు. అలాగే పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుగా గుట్టను తొలగించి అనుమతుల్లేకుండానే వైసీపీ ఆఫీస్ ను నిర్మించారు. కడపలో కర్నూల్ – తిరుపతిలో 6 వరుసల జాతీయ రహదారి పక్కనే కడప ముఖద్వారంలో వైసీపీ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టారు.


రేణిగుంట మండలం కుర్రకాల్వలోని పారిశ్రామికవాడలో, మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్ సమీపంలో రూ.60 కోట్ల విలువైన రెండెకరాల స్థలంలో వైసీపీ కార్యాలయాల్ని నిర్మించారు. బాపట్లలో జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఆర్టీసీ డిపోకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుని వైసీపీ ఆఫీస్ ను నిర్మించారు.


అనకాపల్లి సమీపంలో కాపుభవనంకోసం కేటాయించిన భూమిలో, నరసరావుపేటలో అగ్రహారం భూమి 1.50 ఎకరాల్లో, ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో, కాకినాడలో పైడా వారి వీధిలోనున్న 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న రెండెకరాల భూమిలో, విశాఖపట్నం చినగదిలి మండలం ఎండాడలో రూ.100 కోట్ల విలువైన భూమిలో, పార్వతీపురం పట్టణ పరిధిలోని కొత్తబెలగాంలో వైసీపీకి కేటాయించిన 1.18 ఎకరాల్లో, రాజమండ్రిలో రోడ్ల భవనాల శాఖకు చెందిన రెండెకరాల స్థలంలో వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టారు. ఇలా రాష్ట్రమంతా వైఎస్సార్సీపీ తన ఇష్టారాజ్యంగా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పేరుతో వందలకోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసిందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement