Thursday, September 19, 2024

AP: మహానంది ఆలయ భూముల ఆక్రమణ.. స్వాధీనం చేసుకున్న అధికారులు

నంద్యాల బ్యూరో, ఆగస్టు 24 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయ భూములను ఆక్ర‌మించుకోవ‌డంతో శనివారం దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల మేరకు… నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో 3.78 ఎకరాల భూమి దేవస్థానంకు సంబంధించినది ఉంది.

ఆ భూమిలో రెండు ఎకరాల భూమిని కొంత మంది ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు. ఈ సంఘటనపై 27మంది కోర్టులో కేసులు వేశారు. ఇందులో మూడు ఫ్లాట్లను స్వాధీనం చేసుకోవాలని ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు మేరకు శనివారం ఉదయం దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ అధికారులు భూములను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో నిర్మించిన కట్టడాలను జేసీబీల‌తో తొలగిస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి గతంలో పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement