తాడేపల్లి – ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని, . రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి విషప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 2019లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు టీడీపీ ఎందుకు మద్దత్తిచ్చిందని ఆయన ప్రశ్నించారు. దీనిపై అసత్యాలు ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోందన్నారు. వీళ్లు అసలు మనుషులా..? పిశాచాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా ? అని సవాల్ విసిరారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ భూములు కొన్నారని, మరి ఆ పత్రాలు జిరాక్స్ కాపీలేనా? అంటూ ప్రశ్నించారు.
తమరి హయాంలోనే ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని బాబు జిరాక్స్ కాపీలంటున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.