విశాఖ జిల్లా, ప్రభన్యూస్ : ఉద్యోగం ఇచ్చి నెలనెలా జీతం ఇస్తున్న బ్యాంకునే ఆ ఉద్యోగులు మోసం చేసిన వినూత్న ఘటన విశాఖ నగరం ఎంవీపీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పెద్దవాల్తేరులోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో బంగారం తనఖా పెట్టి రుణాలు మంజూరు చేసే ఉద్యోగి అయిన ఒన్‌టౌన్ ఏరియాకు చెందిన నాగులకొండ నరసింగరావు(44) పసిడి నాణ్యతను కొలిచే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పసిడి నాణ్యత కొలిచింది తానే కాబట్టి.. అవకతవకలకు పాల్పడి అతనికి సంబంధించిన వ్యక్తులకు సుమారు రూ.63,80,000ల లోన్లు ఇప్పించాడు.
ఈ బండారం బయటపడడంతో గత నెల 4వ తేదీన అతన్ని అదుపులోనికి తీసుకుని రిమాండ్‌కు పంపించారు. దీంతో ఎంవీపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణలో సదరు ముద్దాయి నరసింగరావుకు బ్యాంకు మేనేజర్ బి.రాజేష్‌బాబు, సిబ్బంది ఎన్.జగదీష్‌కుమార్, పి.రమ్యతేజలు కూడా సహకరించినట్టు రుజువు కావడంతో ముగ్గురిని మంగళవారం అదుపులోనికి తీసుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..