Tuesday, October 1, 2024

Elephent Huns – సరిహద్దుల్లో మదగజం! ఆడ ఏనుగులకు దడ దడే​

ఏపీలో పంటల ధ్వంసానికి బ్రేక్​
ఏనుగుల దాడి ఆపేందుకే ఆపరేషన్ కుంకీ​
​గుంపును తరిమేందుకు సరికొత్త యత్నాలు
ఉపముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​ ఆలోచనలు
కర్నాటక రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్​ ఒప్పందాలు
రైతన్నలకు ఇక మీదట కలగదు కష్టం
కుంకీలంటే అలాంటి ఇలాంటి ఏనుగులు కావు
నిరంతరం తహతహలాడే మదపుటేనుగులు
ఫుల్లీ ట్రెయిన్డ్.. కఠినమైన కఠోర శిక్షణ​ వీటి సొంతం
ఆపరేషన్​కు దిగితే అంతు తేల్చాల్సిందే
లోకల్​ ఏనుగులకు.. ఇవంటే లైంగికదాడి భయం

కంటికి కనిపించిన అరటి మొక్కల్ని తొక్కేస్తూ.. భీకర ఘర్జనలతో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే ఎగబడతాయి. తొక్కి ప్రాణం తీస్తున్నాయి. ఇదంతా చాలాకాలంగా జరుగుతోంది. ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమలోని చిత్తూరు జిల్లా.. మన్యంలోని గిరిజనులకు అటవీ ప్రాంతాల్లోని ఏనుగుల బెడద ఎక్కువైంది. ఏనుగుల సవ్వడి వినగానే అక్కడి జనం ఊరిని వదిలి పారిపోతారు. ఊళ్లోని పొలాలను తొక్కి నార తీసి.. మరో ప్రాంతానికి ఈ గజ మంద వెళ్లిన తర్వాతనే వారంతా మళ్లీ గూడేనికి చేరుకుని, తమ పంట విధ్వంస స్థితిని చూసి కన్నీరు పెడుతున్నారు.

ఇక ఈ సీన్ కనిపించకూడదనే.. ఏపీ సర్కారు ఇటీవల ఓ వ్యూహాన్ని రచించింది. ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో.. బీభత్సాన్ని సృష్టించే ఏనుగుల మంద దూకుడుకు కళ్లెం వేసేందుకు ఏపీ అడవుల్లో కుంకీ ఎనుగులను దిగుమతి చేయనున్నారు. కర్నాటక ప్రభుత్వంతో ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఫలితంగా ఇది సాధ్యం అయ్యింది. ఇంతకీ ఈ కుంకీ ఏనుగులంటే ఏమిటి? ఏనుగుల మంద వీటిని చూసి ఎందుకు బేజారెత్తిపోతుంది అనే విష‌యాల‌ను చ‌దివి తెలుసుకుందాం.

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌ – పల్లెల్లో పంటలను ధ్వంసం చేసే ఏనుగుల‌ మందను తరిమికొట్టడానికి.. కుంకీ ఏనుగులను ప్రధాన అస్త్రంగా అటవీ శాఖ సంధిస్తోంది. ఈ కుంకీ ఏనుగుల కథ తెలుసుకోవాలంటే చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లాల్సిందే. కౌండిన్య అభయారణ్యంలో ననియాల అటవీ శిబిరం సంరక్షణలో రెండు కుంకీ ఏనుగులు పలకరిస్తాయి. ఈ రెండు ఏనుగులు అటవీ శాఖ సిబ్బంది నుంచి కావల్సినంత ప్రేమ, ఆప్యాయతను పొందుతున్నాయి. పంటల్ని ధ్వంసం చేయడానికి వచ్చే ఏనుగులను తరిమి కొట్టడమే ఈ కుంకీల ప్రత్యేకత. అంతే కాదు.. ఎదురు తిరిగితే వీటితో పోరాడుతాయి. దాడికి వచ్చిన ఏనుగులు తోక ముడిచి పరుగులు తీస్తాయి. ఆ రెండు గజరాజుల పేర్లు జయంత్, వినాయక్. వీటినే కుంకీ ఏనుగులని పిలుస్తారు. అటవీ శాఖ కోసం నౌకరులుగా.. కాదు కాదు.. కట్టు బానిసలుగా.. ఊహూ.. ఆప్యాయంగా పనిచేసే ఈ రెండూ కుంకీలు 17 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోనే కాదు.. ఏపీలోని వివిధ గ్రామాల్లో పంటలను కాపాడే వీర సేనాని పాత్ర పోషిస్తున్నాయి. ఆపరేషన్ కుంకీస్ ప్రారంభమైతే.. అక్కడి ఏనుగులను తరమకుండా తిరిగి వచ్చింది లేదు. ఒక్కోసారి ఒడిశా అడవుల నుంచి వచ్చి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పంటలు ధ్వసం చేసే ఏనుగులను తరమడానికి వీటితో అటవీశాఖ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ రెండు కుంకీలతో ఆపరేషన్లు జైత్రయాత్రగా సాగుతున్నాయి.

కుంకీలంటే.. ఎందుకంత భ‌యం..

కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలకు మధ్య చిత్తూరు జిల్లాలోని కుప్పం అటవీ ప్రాంతం త్రికేంద్రంగా ఉంటుంది. ఆ పరిధిలో ఏనుగుల సంచారం ఎక్కువ. పక్క రాష్ట్రాల నుంచి ఏనుగులు తరచూ గ్రామలపైకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తుంటే.. 2006లో ననియాల ఏనుగుల క్యాంప్‌కు బీజం పడింది. రెండు మగ ఏనుగులను మాత్రమే కుంకీలుగా ఎంచుకుంటారు. మగ ఏనుగులు మాత్రమే ఒంటరిగా తిరుగుతాయి. ఆడ ఏనుగులు ఎప్పుడూ తమ పిల్లలకు రక్షణగా పెద్ద మందలోనే ఉంటాయి. ఆ ఏనుగులకు ఒక ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. మగ ఏనుగును కుంకీగా ఉపయోగిస్తారు. ఆడ ఏనుగుల మంద పంట పొలాలపై దాడి సమయంలో కుంకీని తీసుకెళ్లగానే అవి తమ మందలోని పిల్ల ఏనుగులకు మగ ఏనుగులకు చిక్కకుండా వీలైనంత వరకూ అక్కడి నుంచి తప్పించుకుంటాయి. అంటే.. కుంకీ ఏనుగులు లైంగిక దాడికి పాల్ప‌డ‌తాయ‌నే భ‌యంతో పారిపోతుంటాయి.

శిక్షణ మహాకష్టం గురూ..

అడవిలో స్వేచ్ఛ‌గా తిరిగే ఏనుగులను కుంకీలుగా శిక్షణ ఇవ్వటం అంత సులభం కాదు. ముఖ్యంగా పంటలకు, మనుషులకు హాని చేస్తూ కొరకరాని కొయ్యలా మారిన ఏనుగులనే అటవీశాఖ అధికారులు ఎంపిక చేసుకుని కుంకీలుగా శిక్షణ ఇస్తారు. ఎక్కువగా మనుషులను చంపి, గాయపరచిన ఏనుగులనే గుర్తిస్తారు. వాటిని కష్టపడి మరీ పట్టుకుంటారు. తర్వాత ఆహార నియామాలు పాటిస్తూ, డాక్టర్ల పర్యవేక్షణలో మావటిలతో శిక్షణ ఇస్తారు. 2006 నుంచి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంపు పెట్టిన తర్వాత జయంత్, వినాయక్ కుంకీలుగా మారాయి. పంట పొలాలపైకి అట‌వీ ఏనుగులు వచ్చి, పంటలు నష్టం చేసే సమయంలో ఈ కుంకీలతో డ్రైవ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శిక్షణ పొందిన ఏనుగుల క్యాంప్ ఇక్కడ మాత్రమే ఉంది’’ అని ఫారెస్ట్ ఆఫీస‌ర్‌ మదన్ మోహన్ రెడ్డి చెప్పారు.

ట్రైనింగ్ యమ సీక్రెట్ గురూ

ఒక అడవి ఏనుగును కుంకీగా మార్చడానికి వాటికి ఇచ్చే శిక్షణ చాలా క్లిష్టంగా ఉంటుంద‌ని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ‘‘ఏ ఏనుగును ఎలా ఎదుర్కోవాలి అనేది మావటి సంకేతాల ఆధారంగానే సాగుతుంది. ఉదాహరణకు మావటిని ఎక్కించుకోవడం, చైన్ తీసుకోవడం, ఏవైనా అడవి జంతువులు వచ్చినపుడు గట్టిగా అరచి భయపెట్టడం లాంటి శిక్షణ ఇస్తుంటారు. కుంకీ చెవిని మావటి తన కాలితో తాకడం, తలపై తట్టడం లాంటి సంకేతాలు ఇస్తుంటాడు. కానీ, వాటికి ఇచ్చే శిక్షణ చాలా సీక్రెట్. ‘‘కుంకీగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అడవిలో ఎన్ని ఏనుగులు వచ్చినా అది ఎదుర్కొంటుంది. వెనక్కి రాదు, ఎలాగైనా సరే, పోయి కొట్టే రావాలా. ఎంత పెద్ద గుంపు వచ్చినా, కొట్టేస్తుంది. మేం ఇచ్చే శిక్షణ అలా ఉంటుంది. ఏనుగులు మందగా వస్తే వాటిని తరిమేస్తుంది. ఒకటి రెండు ఏనుగులు దొరికితే కుంకీల సాయంతో పట్టుకుంటారు. ఏనుగుల మంద ఉన్నప్పుడు పెద్దగా సమస్య ఉండదు. ఒక్క ఏనుగు ఉన్నప్పుడే చాలా ప్రమాదం. అలాంటప్పుడు వచ్చిన ఏనుగు మదమెక్కి ఉంటుంది. దాంతో ఈ ఏనుగుకు కూడా మదం వస్తుంది. ఒక్కోసారి పోరాటం తీవ్రంగా జరుగుతుంది. ఆ సమయంలో కంట్రోల్ చేయడం కూడా కష్టం. . చెవిని కాలితో దడితే ముందుకు పోతుంది. చెవికి వెనుక కాలి తొడను తడితే వెనక్కు పోతుంది. రెంటి మధ్యలో అదిమితే అగిపోతుంది. ఇక ‘‘జయంత్, వినాయక్ ఏనుగులు రెండూ ప్రతి రోజూ ఉదయం 9 గంటల లోపే సహజంగా లభించే ఆహారం కోసం అడవిలోకి వెళ్తుంటాయి. డ్రైవ్స్ ఏవీ లేని సమయంలో అవి సాయంత్రం వరకూ అడవిలోనే తిరుగుతుంటాయి. తర్వాత సాయంత్రం వచ్చేటపుడు తాము తినడానికి మర్రి, జువ్వు, రాగి చెట్ల ఆకులు తెచ్చి పెడితే అవి తమ దంతాలపై దాచుకుంటాయి” అని ట్రెయినింగ్​ ఇచ్చే ఫారెస్ట్​ ఆఫీసర్లు తెలిపారు.

ఆ రెండు కుంకీల కథ ఏంటంటే..

అడవి ఏనుగు జయంత్ వయసు సుమారు 54 ఏళ్లు. దీన్ని 1996లో తిరుమల అడవుల్లోని అవ్వాచేరి కోన దగ్గర పట్టుకున్నారు. తిరుపతి జూలో ఉంచి కుంకీగా ట్రైనింగ్ ఇచ్చారు. దీంతోపాటు పట్టుకున్న విజయ్​ను అప్పడు ఉమ్మడి రాష్ట్రం కావడంతో హైదరాబాద్ జూకు తరలించారు. వినాయక్ వయసు సుమారు 58ఏళ్లు. దీన్ని చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం భూమిరెడ్డిపల్లి దగ్గర పట్టుకున్నారు. దీనికి ననియాల ఎలిఫెంట్ క్యాంపులో ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడున్న గణేష్ అనే మరో కుంకీ ఏనుగును తిరుపతి జూకు పంపించేయడంతో దానికి బదులు ననియాల క్యాంపుకు వినాయక్ వచ్చింది. కుంకీగా ట్రైనింగ్ ఇవ్వడానికి దాని స్థితిని బట్టి మూడు నుంచీ ఆరు నెలలు పడుతుంది.

పాపం వయస్సు మళ్లింది

ఇన్నేళ్లూ రైతులకు సేవలందించిన ఈ ఏనుగులు ఇప్పుడు ఉద్యోగ విరమణ వయసుకు చేరుతున్నాయి. ఈ రెండు ఏనుగులకూ ప్రతి దాదాపు నెలకు రూ. 2.5 లక్షలు ఖర్చు అవుతోంది. వీటికి తగిన ఆహారంతో పాటూ, విటమిన్లు కూడా ఇవ్వాలి. ప్రస్తుతం అధికారులు దాతల కోసం చూస్తున్నారు. ‘‘వీటి వయసు మీరుతున్న తరుణంలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటి స్థానంలో కొత్త కుంకీలు కావాలి. వెంకన్న అనే కుంకీ ట్రైనింగ్ లో ఉంది. మరొక కుంకీని పట్టకుని శిక్షణ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. దాతలు ముందుకు వస్తే ఈ కుంకీల జంటను దత్తత ఇవ్వటానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎనీ హౌ… కొత్త కుంకీల రాకతో ఈ జంటకు ఎలాంటి వీడ్కోలు ఇస్తారో?. ఊహించలేం

Advertisement

తాజా వార్తలు

Advertisement