Sunday, January 19, 2025

Elephants Attack – ఏనుగుల దాడి – టీడీపీ యువనేత మృతి

తిరుపతి – ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ఏనుగులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏనుగుల దాడిలో మరో వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతుంది. ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్‌చౌదరి మృతి చెందాడు.

కందులవారిపల్లి ఉపసర్పంచ్‌గా, టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్న రాకేశ్‌ చిన్న రామాపురం కొంగరవారిపల్లిలో ఏనుగుల గుంపు ఉందన్న సమాచారంతో తోటలోకి వెళ్లాడు. ఏనుగుల రాకను గమనించకపోవడంతో కాళ్లకింద పడి మృతి చెందాడు.

- Advertisement -

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని అర్థరాత్రి ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాకేశ్‌ మరణం టీడీపీకి తీరనిలోటని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు






Advertisement

తాజా వార్తలు

Advertisement