Monday, November 25, 2024

విద్యుత్ ఛార్జీల పెంపు : సీఎం జ‌గ‌న్ పై అచ్చెన్నాయుడు ఫైర్

ఏపీ ప్ర‌భుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించింది. దీంతో వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు ఛార్జీలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. జగన్ అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి జనం నడ్డి విరిచారన్నారు. ప్రజలపై ప్రస్తుత విద్యుత్ ఛార్జీల పెంపుదలతో 4,400 కోట్ల భారం పడుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ కు పాలన చేతకాకపోతే దిగిపోవాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ జనంపై వీర బాదుడు బాదుతున్నారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement