Thursday, December 12, 2024

AP | విద్యుత్ కాంట్రాక్టర్ దారుణహత్య

కొత్తచెరువు, డిసెంబర్ 12 (ఆంధ్రప్రభ) : విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురైన ఘ‌ట‌న‌ శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు సమీపంలోని ఫామ్ హౌస్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. నల్లమాడ మండలానికి చెందిన విద్యుత్ కాంట్రాక్టర్ కొత్తచెరువు మండలంలో విద్యుత్ కాంటాక్ట్ పనులు చేస్తూ కొత్తచెరువు సమీపంలోని ఫామ్ హౌస్ లో ఉన్నారు.

బుధవారం రాత్రి విద్యుత్ కాంట్రాక్టర్ నాగభూషణ్‌ తో పాటు ఇద్దరు సహాయకులు ఫామ్ హౌస్ లో నిద్రిస్తుండగా, దుండగులు ప్రవేశించారు. నాగభూషణ్ ను హత్య చేయడానికి దుండగులు ప్రయత్నించడంతో, సహాయకులు పారిపోయి పోలీసులకు సమాచారం అందించారు. ముందుగా హంతకుడు కాంట్రాక్టర్ నాగభూషణ్ ను ఫామ్ హౌస్ కు దూరంగా తీసుకువెళ్లి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని తీసుకువచ్చి ఫామ్ హౌస్ లో వేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న సిఐ ఇందిరా సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement