Sunday, November 24, 2024

ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా ముఖ్యం.. మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి సిటీ, ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్): ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా ముఖ్యమ‌ని, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఓ ప్రైవేటు వాటర్ నందు విద్యుత్ ప్రమాదాల నివారణ పై ప్రారంభమైన వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంద‌న్నారు. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యమని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మరోసారి రుజువైందన్నారు. అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని కోరారు.చంద్రబాబు నాయుడు భారీగా ప్రచారం చేసుకున్న కూడా ఆయన పెట్టిన సమ్మిట్ కు సంబంధించి ఎక్కడ ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని గుర్తు చేశారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమ్మిట్ కు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు పాల్గొనడం జరిగిందని వివరించారు. ముందుకు వచ్చిన పెట్టుబడిదారులకు సహకరించి వారికి ప్రక్రియ సులభంగా మారేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఒకేసారి 15000 మంది ఎనర్జీ అసిస్టెంట్లను ఇప్పటికే నియామకం జరిగిందన్నారు. వారి సేవలను కూడా ఉపయోగించుకోవాలని కోరారు. పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అటవీ జంతువులు కట్టడికి కూడా విద్యుత్ వైర్లు లాగుతున్న పరిస్థితి ఉందని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు. ఈ వర్క్ షాప్ ద్వారా అందరికీ పూర్తిస్థాయి అవగాహన వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఎండి సంతోష్ రావు, ఎస్ఈ ఆపరేషన్ కృష్ణారెడ్డి, డీఈ ఆపరేషన్ వాసుదేవ రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement