నాయుడుపేట, (ప్రభన్యూస్): తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో ఓ జింక చనిపోవడం ఆందోళన కలిగించింది. పుదూరు గ్రామ సమీపంలోని పొలాల వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. నాయుడుపేట- మల్లాం ఆర్ అండ్ బీ రహదారి పక్కన ఓ రైతు తన పొలంలోని నారుముడులను కాపాడుకునేందుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు.
అయితే.. అడవిలోంచి తప్పిపోయిన ఓ జింక దాహం తీర్చుకునేందుకు పొలాల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇట్లా అది పొలాలకు వేసిన విద్యుత్ ఫెన్సింగ్ని తాకి విద్యుత్ షాక్తో చనిపోయినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు కూడా స్థానిక గ్రామస్తులు సమాచారం అందించారు.