చిత్తూరు – విద్యుత్ షాక్‌తో ఓ నవ వరుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.. చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమల మండలం దేవలకుప్పం అటవీ ప్రాంతంలో గొర్రెల కాసేందుకు వెళ్లారు ముగ్గురు యువకులు.. యథావిథిగా గత రాత్రి ఇంటికి చేరుకున్నారు.
అయితే, గొర్రెలు తిరిగి మందకు చేరిన తర్వాత త మందలోని కొన్ని గొర్రెలు కొన్ని కనబడకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.. రాత్రి సమయంలోనే తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు యువకులు.. ఇక, తప్పిపోయిన గొర్రెలను వెతికే క్రమంలో.. అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి.. గంగాధర్ అనే 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, ఈ ఘటనలో గంగాధర్ కన్నుమూశాడు.. ఇటీవలే మృతుడు గంగాధర్‌కు వివాహం జరిగింది.. దీంతో, రెండు కుటుంబాల్లో ఈ ఘటన విషాదాన్ని నింపింది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.