Tuesday, November 19, 2024

Electric Bus – తిరుమ‌లలో శ్రీవారి ధ‌ర్మ‌ర‌థం చోరీ…

తిరుమల: సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ స్వామివారి ఉచిత ధర్మరథం బస్సు చోరీకి గురైంది. ఎవరికి అంతుచిక్కని విధంగా దుండగుడు పక్క ప్రణాళికతో విద్యుత్ ధర్మరథం బస్సును ఎత్తుకెళ్లాడు దుండగుడు విద్యుత్ బస్సును నాయుడుపేట బైపాస్ రోడ్డులో వదిలి వెళ్లి పరారయ్యాడు. శనివారం రాత్రి ఛార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకు ఛార్జింగ్ కు నిలిపాడు డ్రైవరు . ఉదయం ఛార్జింగ్ స్టేషన్ వద్ద వచ్చి చూడటంతో బస్సు కనిపించకపోవడంతో డ్రైవరు అధికారులకు సమాచారం అందజేశారు.

దీంతో టిటిడి రవాణా శాఖ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుడు తెల్లవారి జామున 3:53 గంటలకు జీఎన్‌పీ వద్ద ఘాట్ రోడ్డులోకి వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ప్రసుత్తం తిరుమలలో నడుస్తున్న కొత్త విద్యుత్ బస్సుల్లో జీపీఎస్ లొకేషన్ ఉండటంతో నాయుడుపేట వద్ద బస్సు ఉందని తెలుసుకున్న అధికారులు నాయుడుపేట పోలీసులను అప్రమత్తం చేశారు. ఉదయం 10 గంటల నాయుడుపేట ప్రాంతంలో పోలీసులు ఆపడంతో బస్సును ఆపిన దొంగలు ఉడాయించారు..
ఈరోజు మేరకు టిటిడి రవాణా శాఖ తిరుమల క్రైమ్ స్టేషన్లో కేసునమోదు చేయించింది. కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు విచారణ చేపట్టారు. బ‌స్సును నాయుడుపేట నుంచి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించారు. ఇది ఇలా ఉంటే వారంరోజుల క్రితం టిటిడి హెల్త్ విభాగం ఉద్యోగి కారును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.. దానిని ఒంటిమిట్ట వద్ద వదిలి వెళ్లారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement