Sunday, November 24, 2024

Elections – దేశంలోని సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇదే….

సార్వత్రిక ఎన్నికల కు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. జ‌మ్ముక‌శ్మీర్ అసెంబ్లీకి ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంద‌రూ భావించినా షెడ్యూల్ విడుద‌ల కాలేదు ..
మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఇక నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు.
ఎపి,తెలంగాణ ఎన్నిక‌ల షెడ్యూల్
ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్
ఏప్రిల్ 18 నుంచి 25 వరుకు నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
మే 13న పోలింగ్‌
జూన్ 4న ఓట్ల లెక్కింపు
ఏపీ, తెలంగాణలో ఒకే రోజున లోక్‌సభ పోలింగ్‌
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు.
మొత్తం 7 దశాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

  • యూపీ, బీహార్‌, బెంగాల్‌లో ఏడు దశల్లో పోలింగ్
  • మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు
  • ఛత్తీస్‌గఢ్, అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు
  • కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్‌లో రెండు దశల్లో పోలింగ్
  • ఏపీ, తెలంగాణ సహా మిగిలిన 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దశలో ఎన్నికలు. ఏపీ ,తెలంగాణ , అరుణాచల్‌,ఢిల్లీ,గోవా,గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ , హర్యానా , కేరళ, తమిళనాడు, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, మిజోరాం, మేఘాలయా. నాగాలాండ్‌, పుదుచ్చేరి, చండీఘడ్‌,లక్షద్వీప్‌,దాద్రానగర్‌ హవేలి,అండమాన్‌ నికోబార్‌లో ఒకే దశలో పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికలు ఇలా..
తొలి దశ: ఏప్రిల్‌ 19, 102 స్థానాలు (21 రాష్ట్రాలు)
రెండో దశ: ఏప్రిల్‌ 26, 89 స్థానాలు (13 రాష్ట్రాలు)
మూడో దశ: మే 7, 94 స్థానాలు (12 రాష్ట్రాలు)
నాలుగో దశ: మే 13, 96 స్థానాలు (10 రాష్ట్రాలు)
ఐదో దశ: మే 20, 49 స్థానాలు (8 రాష్ట్రాలు)
ఆరో దశ: మే 25, 57 స్థానాలు (7 రాష్ట్రాలు)
ఏడో దశ: జూన్‌ 1, 57 స్థానాలు (8 రాష్ట్రాలు)

లోక్‌సభ: తొలి దశ
నోటిఫికేషన్‌: 20 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి
నామినేషన్ల పరిశీలన: 28 మార్చి
ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి
పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 19

లోక్‌సభ : రెండో విడత
నోటిఫికేషన్‌: 28 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 04
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 5వ తేదీ
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 8
పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 26

లోక్‌సభ: మూడో దశ
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 12, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 20
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 22
పోలింగ్‌ తేదీ: మే 7

- Advertisement -

లోక్‌సభ: నాలుగో విడత
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 18, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 29
పోలింగ్‌ తేదీ: మే 13

లోక్‌సభ: ఐదో విడత
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 26, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3
నామినేషన్ల పరిశీలన: మే 4
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6
పోలింగ్‌ తేదీ: మే 20

లోక్‌సభ: ఆరో విడత
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 29, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6
నామినేషన్ల పరిశీలన: మే 7
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9
పోలింగ్‌ తేదీ: మే 25

లోక్‌సభ: ఏడో విడత
నోటిఫికేషన్‌: మే 7, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14
నామినేషన్ల పరిశీలన: మే 15
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17
పోలింగ్‌ తేదీ: జూన్ 1

Advertisement

తాజా వార్తలు

Advertisement