Monday, November 25, 2024

AP: రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు.. షెడ్యూల్ విడుద‌ల

జులై 2న నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌
12న పోలింగ్

ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 25న నోటిఫికేషన్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జులై 3న ఆ నామినేషన్లను పరిశీలిస్తారు. 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎన్నికలను 12న నిర్వహింనుంది ఈసీ. అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు.

వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఎన్నికలకు కొన్ని రోజుల ముందు టీడీపీలో చేరారు. వైసీపీ ఫిర్యాదుతో శాసనమండలి చైర్మన్ మోషేన్‌ రాజు రామచంద్రయ్య పై అనర్హత వేటు వేశారు. మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ పై సైతం వేటు పడింది. దీంతో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది.

- Advertisement -

అయితే.. ప్రస్తుతం అసెంబ్లీలో మారిన బలాల దృష్ట్యా కూటమికే ఈ రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో అనేక మంది పొత్తుల్లో భాగంగా తమ సీట్లను త్యాగం చేశారు. దీంతో వారంతా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడే అవకాశముంది. వీరిలో పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన ఉమ్మడి ఖాతాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement