సీఎం తన ప్రసంగాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య సీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం జగన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్‌మీనా నోటీసు ఇచ్చారు.
అనుచిత వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఈవో.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సకాలంలో స్పందించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇటీవల నిర్వహించిన సిద్ధం సభల్లో జగన్ మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు అలవాటు చేసుకున్నారంటూ విమర్శలు చేశారు. అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోల్చుతూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చసశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా జగన్ కు నోటీసులు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ పై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న వైసీపీ నేతల ఫిర్యాదుకు స్పందించిన ఈసీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది ఈసీ.