అమరావతి, : ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఈమేరకు ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది మార్చిలో నిలచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చారు. అదేనెల 8వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. 10వ తేదీన ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా హైకోర్టులో వేసిన పిటీషన్ మూలంగా ఫలితాలను నిలిపేశారు. రిట్ పిటీషన్ తీర్పు వచ్చేంత వరకూ ఫలితాలను నిలుపుదల చేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈనేపథ్యంలోనే ఈ ఫలితాల తీర్పుపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ క్రమంలోనే గురువారం నుండి గ్రామీణ ప్రాంతాల్లో విధించిన ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆమె తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement