16న ముంబయి వెళ్లనున్న టీడీపీ అధినేత
ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా అక్కడే
రెండు రోజుల పాటు జనసేనాని ప్రచారం
రేపు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
ఎన్‌డీఏ కూటమి పెద్దలతో మంతనాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే రెండు కూటముల నడుమ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటు ప్రధాని మోదీ నుంచి అటు రాహుల్ గాంధీ వరకు అక్కడ తిష్టవేసి తమ కూటమి అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తున్నారు. 288 స్థానాలున్నా అసెంబ్లీకి ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. తాజాగా ఈ ఎన్నికల ప్రచార పర్వంలోకి సీఎం చంద్రబాబు దిగనున్నారు.
బాబు పర్యటన ఖరారు..
ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది.. 16వ తేదీన మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా 16, 17వ తేదీల్లో మరాఠ గడ్డపై ఎలక్షన్ క్యాంపయిన్ చేపట్టనున్నారు. ఇక చంద్రబాబ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కూటమి నేతలతో సమావేశం కానున్నారు.. ఆ రోజు అక్కడే ఉండి మర్నాడు ముంబయి వెళ్లనున్నారు.. అక్కడ కూటమి నేతలు నిర్ణయించిన ప్రాంతాల్లో జరిగే ర్యాలీలు, ప్రచారంలో పాల్గొంటారు.