ఇల్లందు… తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని బి అర్ ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనీ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు . సోమవారం ఉదయం ఎమ్మెల్యే కనకయ్యతో కలిసి ఐఎన్‌టీయూసీ తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో పలువురు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు ఐఎన్‌టీయూసీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందులో కార్మికులు, ఉద్యోగులు ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కోరం కనకయ్య కు భారీ మెజార్టీ ఇచ్చారని, అదే స్ఫూర్తి తో సింగరేణిలో గుర్తింపు సంఘం గా ఐ ఎన్ టి యు సి కి అవకాశం ఇవ్వాలన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. కార్మికుల వైద్య అవసరాలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. కారుణ్య నియామకాలు నిష్పక్షపాతంగా చేపడుతామని అన్నారు. అంతేకాదు.. కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరుస్తామని భరోసా ఇచ్చారు. సింగరేణి నీ కాపాడే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి వుందన్నారు. ,కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఐ ఎన్ టి యు సి నీ గెలిపించాలని కోరారు.
ముందుగా మంత్రి హోదాలో మొదటి సారి ఇల్లందు కు వచ్చిన పొంగులేటి కి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ డి వి,విజయబాబు,లింగాల జగన్నాధం, తదితరులు పాల్గొన్నారు.