ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. .వైఎస్ జగన్ ప్రస్తుతం చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.
ఒకే రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ రోడ్ షోలను నిర్వహిస్తూ వస్తోన్నారు.శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.
ఈ ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు చిత్తూరు జిల్లా నగరికి బయలుదేరి వెళ్తారు. ఈ నియోజకవర్గం పరిధిలోని కార్వేటి నగరంలో రోడ్ షోలో ప్రసంగిసస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కడపలో ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగిస్తారు.
అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, మాజీ మంత్రి నారా లోకేష్.. వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తోన్నారు.
నేడు పశ్చిమగోదావరి జిల్లా ఉండి, ఏలూరు, కృష్ణా జిల్లా గన్నవరం, పల్నాడు జిల్లా మాచర్ల, ప్రకాశం జిల్లా ఒంగోలుల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు చంద్ర బాబు..