ముంబై – ఛత్రపతి శివాజీ మహరాజ్ నడిచిన నేలపై తాము ఎవరికీ భయపడేది లేదన్నారు జనసేన అధ్యక్షుడు, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. . సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యమని అన్నారు. సినిమాల్లో పోరాటాలు చేయడం, గొడవ పెట్టడం చాలా ఈజీ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం కొట్లాడటం, నిలబడటం చాలా కష్టమని తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన మహాయుతి కూటమి గెలుపు కోసం డగ్లూర్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ప్రతి హిందువు గుండెలో రామనామం లేకుండా ఉండదని అన్నారు. హిందువులంతా ఏకమైతే దేశాన్ని విచ్ఛినం చేసేందుకు వచ్చే వాళ్లు ఎంత అంటూ హాట్ కామెంట్ చేశారు. ఛత్రపతి శివాజీ నడిచిన నేలలో ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదని మజ్లిస్ పార్టీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ కర్మ భూమిగా నిలచిన గొప్ప భూమిపై గౌరవం తెలపడానికి , . రాజ మాత జీజీయా భాయ్ నేర్పిన విలువలతో ఈ నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చానన్నారు. అంతకుముందు తాను మరాఠాలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. మాట్లాడేప్పుడు తప్పులు ఉంటే క్షమించండి అని అన్నారు.
బాలా సాహెబ్ ఠాక్రేను జీవించి ఉండగా కలిసే అవకాశం రాలేదని అంటూ . అన్యాయాలు, అక్రమాలు ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి అని అన్నారు పవన్. సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో ఆయన తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. జనసేన ఏడు సిద్దాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ వాదమేనని అన్నారు ఏ విషయాన్ని అయినా ధైర్యంగా చెప్పడం.. నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం. అధికారంతో సంబంధం లేకుండా తమ సిద్దాంతాలకు బలంగా కట్టుబడి ఉండడం ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నానని అన్నారు పవన్.
గడచిన పదేళ్లుగా దేశంలో ఎన్డీఏ పాలనను గమనిస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అందరికి కనపడుతున్నదని చెప్పారు. . దివ్య రామమందిరంతో అలంకరించిన ఆయోధ్య , ప్రపంచ పటంపై తిరంగా రెపరెపలాడుతూ కనబడుతోందని జనసేనాని చెప్పారు. ఎన్డీఏ పాలనలో దేశ నలూములలను కలిపే రహదారులు , పల్లెపల్లెకు విస్తరించిన రోడ్లు కనబడున్నాయన్నారు.
గడచిన పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయలను పేదరికం నుంచి విముక్తి చేసిందన్నారు. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించిందని, పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరిందని, ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చిందన్నారు. అబివృద్ధికి చిరునామాగా ఉన్న మోదీ నాయకత్వంలోని కూటమికే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు పవన్.