Tuesday, November 12, 2024

El Nino Effect … దేశమంతా జూన్ వ‌ర‌కు అగ్గి సెగ‌లే!

ఈ ఏడాది జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తర కోస్తా, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, లక్ష్యద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వెల్ల‌డించింది. సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయని ఐఎండీ అంచ‌నా వేస్తోంది.

ఉత్త‌ర భార‌తంలోనూ సూర్య ప్ర‌తాపం

జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశం ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న మూడు నెలల్లో 10 నుండి 20 రోజుల పాటు వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, సౌరాష్ట్ర-కచ్, మహారాష్ట్ర, ఉత్తర కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎక్కువగా వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రం వెంట సముద్ర ఉపరితం అసాధారణంగా వేడిక్కింది. ఎల్‌నినో పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎల్‌నినో కారణంగా వర్షపాతం తక్కువగా న‌మోదు అయ్యే అవ‌కాశాలున్నాయి. అంతేకాదు ఉష్ణోగ్రతలు కూడా పెర‌గ‌నున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement