ఉత్తరప్రదేశ్‌లో జరిగే మహా కుంభమేళాకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ స్టేషన్ల నుంచి మరో 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. ఇందులో నాలుగు ప్రత్యేక రైళ్లు ఉండగా, మరో నాలుగు ప్రత్యేక రైళ్ల సర్వీసును పొడిగించారు.
ప్రత్యేక రైళ్లు..
మంగళూరు సెంట్రల్ – వారణాసి. (రైలు నెం. 06020)
వారణాసి – మంగళూరు సెంట్రల్. (రైలు నెం. 06020)
చెన్నై సెంట్రల్ – గోమతినగర్ (రైలు నెం. 06071)
గోమతినగర్ – చెన్నై సెంట్రల్ (రైలు నెం. 06072) సర్వీసులను ఏర్పాటు చేసింది.
ఈ ప్రత్యేక రైళ్లు పొడిగింపు..
షోలాపూర్ – ముంబయి (రైలు నెం. 01435) జనవరి 7వ తేదీ నుంచి మార్చి 25 వరకు ప్రతి మంగళవారం
ముంబయి – షోలాపూర్ (రైలు నెం. 01436) జనవరి 1 నుంచి మార్చి 26 వరకు ప్రతి బుధవారం.
షోలాపూర్ – తిరుపతి (రైలు నెం. 01437) జనవరి 2 నుంచి మార్చి 27 వరకు ప్రతి గురువారం.
తిరుపతి – షోలాపూర్ (రైలు నెం. 01438) జనవరి 3 నుంచి మార్చి 28 వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండనుంది.